ఫిబ్రవరి బాక్సాఫీస్ సంగతేంటి?
అయితే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు పరీక్షా కాలం కావడంతో.. థియేటర్ల ముందు ప్రేక్షకుల సందడి తక్కువ ఉంటుందని అంతా భావిస్తారు
By: Tupaki Desk | 28 Feb 2025 3:15 AM GMT2025 ఫిబ్రవరి మంత్ మరొక రోజులో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు పరీక్షా కాలం కావడంతో.. థియేటర్ల ముందు ప్రేక్షకుల సందడి తక్కువ ఉంటుందని అంతా భావిస్తారు. సినిమాల పరంగా నెమ్మదిగా, వేగంగా సాగే నెలగా మేకర్స్ పరిగణిస్తారు. కానీ ఈసారి పర్లేదనిపించిందని చెప్పాలి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ పట్టుదలతో సినీ ఫిబ్రవరి స్టార్ట్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ మూవీ నిరాశపరిచింది. ఆ తర్వాత రోజు తెలుగు యంగ్ హీరో నాగచైతన్య.. తండేల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిజ జీవిత ఘటన ఆధారంగా వచ్చిన ఆ మూవీ మంచి హిట్ అయింది.
నేచురల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన తండేల్.. రూ.100 కోట్ల వసూలు చేసిందని మేకర్స ఇప్పటికే వెల్లడించారు. నాగచైతన్య కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా తండేల్ ఘనత సాధించింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు కూడా సిద్ధమవుతోంది. అక్కడ కూడా మంచి హిట్ గా నిలిచి.. భారీ వ్యూస్ సాధించే అవకాశం ఉంది.
ఆ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ లైలాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన.. ఆ సినిమాతో కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అందుకున్నారు. అనేక మంది సినిమాను ట్రోల్స్ చేశారు. దీంతో భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి అసభ్యకరమైన సినిమాలు చేయనని విశ్వక్ హామీ ఇచ్చారు.
రీసెంట్ గా బాలీవుడ్ మూవీ ఛావా విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో హిందీ డబ్బింగ్ వెర్షన్ బాగానే వసూళ్లు రాబట్టింది. తెలుగు వెర్షన్ మార్చి 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ నటించిన బ్రహ్మానందం రిలీజైంది.
కానీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండింటిలో డ్రాగన్ విన్నర్ గా నిలిచింది. తెలుగులో మంచి వసూళ్లను రాబడుతోంది.
ఇక నిన్న సందీప్ కిషన్ మజాకా రిలీజ్ అవ్వగా.. మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. కామెడీ మూవీ కనుక.. బాక్సాఫీస్ వద్ద వీకెండ్ లో వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఫిబ్రవరిలో తండేల్, చావా, డ్రాగన్ మంచి హిట్స్ గా నిలిచాయి. మజాకా కూడా రాబట్టొచ్చని అంటున్నారు. అలా ఫిబ్రవరి బాక్సాఫీస్ ఇలా ఉంది!!