Begin typing your search above and press return to search.

ఫిబ్ర‌వ‌రి కూడా టైట్ గానే!

ఇక ఇదే నెల‌లో రాంగో పాల్ వ‌ర్మ `వ్యూహం` కూడా రిలీజ్ అవుతుంది. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 Dec 2023 2:30 PM GMT
ఫిబ్ర‌వ‌రి కూడా టైట్ గానే!
X

స‌లార్ రిలీజ్ తో అభిమాన‌లుకు ముందుగానే సంక్రాంతి వ‌చ్చేసింది. ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో విజ‌యం న‌మోదైంది. వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత స‌లార్ రూపంలో భారీ హిట్ అభిమానుల కాల‌రెగ‌రేసేలా చేసింది. షారుక్ ఖాన్ న‌టించిన డంకీ క‌న్నా స‌లార్ ముందంజ‌లో క‌నిపిస్తుంది. హిందీ మార్కెట్ లో థియేట‌ర్లు తక్కువ దొరికినా? స‌లార్ కొచ్చిన న‌ష్టమేమి లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇక ఇదే నెల‌లో ( డిసెంబ‌ర్ 29) నంద‌మూరి వార‌సుడు క‌ల్యాణ్ రామ్ న‌టిస్తోన్న డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ప్రేక్ష‌కుల ముంద‌కు రాబోతుంది. స్పై బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. క‌ళ్యాణ్ రామ్ లో స్టోరీల ఎంపిక‌ల వ‌చ్చిన ఛెంజెస్ అత‌నిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేస్తున్నాయి. బింబిసార తో క‌ళ్యాణ్ రామ్ పై ప్ర‌త్యేక‌మై ఇమేజ్ క్రియేట్ అయింది. అటుపై అమిగోస్ కాస్త నిరాశ‌ప‌రిచినా డిఫ‌రెంట్ అటెంప్ట్ కొంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

ఈ నేప‌థ్యంలో డెవిల్ కోసం నంద‌మూరి అభిమానులు ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇదే రోజున ఫేమ‌స్ యాంక‌ర్ సుమ‌-రాజీవ్ క‌న‌కాల త‌న‌యుడు ప‌రిచయ‌మ‌వుతోన్న బ‌బుల్గ‌మ్ అనే చిత్రం రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బిజ్ ని తీసుకొచ్చాయి. యంగ్ హీరోకి మంచి డెబ్యూ అవుతుంద‌ని సుమ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలకు క్రిస్మ‌స్ సెల‌వుల్ని ఎన్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది.

అటు పై సంక్రాంతి రేసులో వ‌రుస‌గా స్టార్ హీరోలంద‌రూ క‌ర్చీప్ వేసి రెడీగా ఉన్నారు. మ‌హేష్‌.. వెంక‌టేష్... ర‌వితేజ ..నాగార్జున లాంటి స్టార్ హీరోలంతా సంక్రాంతి సీజ‌న్ ని ఎన్ క్యాష్ చేసుకోబు తున్నారు. ఈ స్టార్ హీరోల మ‌ధ్య‌లో త‌గ్గేదేలే అంటూ తేజ స‌జ్జ డెబ్యూ హ‌నుమాన్ జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకుంటున్నాయి. మంచి విజువ‌ల్ ట్రీట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. అటుపై ఇదే నెల‌లో మ‌రికొంత మంది హీరోలు..అనువాదా చిత్రాలు మార్కెట్ లోకి రాబోతున్నాయి.

ఆ ర‌కంగా జ‌న‌వ‌రి నెలంతా రిలీజ్ ల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి. ఇక ఆరంభ‌మే ఫిబ్ర‌వ‌రి కూడా టైట్ గానే క‌నిపిస్తుంది. ఆనెల మొద‌టి వారంలో చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 8న యాత్ర‌-2 రిలీజ్ అవుతుంది. మ‌హి. వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా వైఎస్సార్ పాద‌యాత్ర ని ఆధారంగా చేసుకుని రెండవ భాగాన్ని తెర‌పైకి తెస్తున్నారు. ఇది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీ యాంశ‌మ‌య్యే సినిమా. ఇక యంగ్ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తోన్న టిల్లు స్క్వేర్ కూడా ఆ మ‌రుస‌టి రోజున‌ మంచి అంచ‌నాల‌తోనే రిలీజ్ అవుతుంది. `డిజే టిల్లు`కి సీక్వెల్ గా రిలీజ్ అవుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు..పాట‌లు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి.

మ‌రో వైపు యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న` ఊరు పేరు భైర‌వ కోన` కూడా ఫిబ్ర‌రి 9న రిలీజ్ అవుతుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ పై మంచి అంచ‌నాలున్నాయి. సందీప్ నుంచి మ‌రో ప్రైజ్ ట్రీట్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న ఆప‌రేషన్ వాలెంటైన్ భారీ అంచ‌నాల మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 16న రిలీజ్ అవుతుంది. ఇండియ‌న్ ఎయిర్ పోర్స్ నేప‌థ్యంలో కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వరుణ్ న్యూ లుక్.. ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. వ‌రుణ్ నుంచి రాబోతోన్న మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ గా చెప్పొచ్చు. ఇంకా కొన్ని చిన్నా చిత‌కా..అనువాద చిత్రాలు ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అవుతున్నాయి.