Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి రెండో వారం.. బాక్సాఫీస్ ఎలా ఉందంటే..

ఫిబ్రవరి సెకండ్ వీక్ లో దేశ వ్యాప్తంగా వివిధ భాషలలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. హిందీలో తెరి బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 4:29 AM GMT
ఫిబ్రవరి రెండో వారం.. బాక్సాఫీస్ ఎలా ఉందంటే..
X

ఫిబ్రవరి సెకండ్ వీక్ లో దేశ వ్యాప్తంగా వివిధ భాషలలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. హిందీలో తెరి బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా రిలీజ్ అయ్యింది. షాహిద్ కపూర్, కృతి సనన్ ఈ చిత్రంలో జోడీగా నటించారు. తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలామ్, ప్రేమలు, అన్వేషిపిన్ ఖండితుమ్ రిలీజ్ అయ్యాయి.

అలాగే యాత్ర 2 తెలుగులో రిలీజ్ కాగా లవ్ తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో వచ్చింది. ఈ సినిమాలలో ఈగల్ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన అన్వేషిపిన్ ఖండితుమ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిందీ మూవీ ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళీ మూవీ ప్రేమలుకి పాజిటివ్ టాక్ వచ్చింది.

యాత్ర 2, లవర్ కూడా బాగున్నాయని ఫీడ్ బ్యాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో కొనసాగుతున్నాయి. కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్ద ఇంపాక్ట్ చూపించడం లేదు. మలయాళీ సినిమాలు రెండు కూడా లో బడ్జెట్ లో వచ్చి భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతున్నాయి. ప్రేమలు చిన్న సినిమాగా వచ్చి ఇప్పటి వరకు 10 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. అన్వేషిపిన్ ఖండితుమ్ 9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

తెలుగు సినిమాలలో ఈగల్ 23.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. యాత్ర 2 మూవీ 5.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. లవర్ మూవీ 4 కోట్ల గ్రాస్ తో కొనసాగుతోంది. హిందీ మూవీ ఇప్పటి వరకు 55 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలాం మూవీకి కెరియర్ లోనే తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 15 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమాలలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ లాల్ సలామ్ కావడం విశేషం.

ఇక సినిమాల కలెక్షన్స్ లైన్ గా చూసుకుంటే

తెరి బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా - 55Cr+

ఈగల్ - 23.5Cr+

లాల్ సలామ్ - 15Cr+

ప్రేమలు - 10Cr+

అన్వేషిపిన్ ఖండితుమ్- 9Cr+

యాత్ర2 - 5.5Cr+

లవర్ - 4Cr+