పల్లవి గురించి తన తోటి హీరోలు ఏం చెప్తున్నారంటే
తండేల్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి పల్లవి గురించి ఇప్పటివరకు తనతో కలిసి నటంచిన హీరోలు ఏం చెప్తున్నారో చూద్దాం.
By: Tupaki Desk | 9 Feb 2025 10:54 AM GMTచేసింది తక్కువ సినిమాలైనప్పటికీ తన నటనతో అందరినీ ఫిదా చేసింది సాయి పల్లవి. తను ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ గుర్తిండిపోయేవే. పల్లవి పేరు చెప్పగానే ఎవరైనా సరే అలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదని, ఆమె నెక్ట్స్ లెవెల్ నటి అని చెప్తుంటారు. తండేల్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి పల్లవి గురించి ఇప్పటివరకు తనతో కలిసి నటంచిన హీరోలు ఏం చెప్తున్నారో చూద్దాం.
లవ్ స్టోరీ, తండేల్ రెండు సినిమాల్లో సాయి పల్లవితో కలిసి నటించిన చైతన్యకు ఆమెతో కలిసి సీన్ చేయాలన్నా, డ్యాన్స్ వేయాలన్నా టెన్షన్ వస్తుందని, ఓ రకంగా తన డ్యాన్స్ ఇంప్రూవ్ అవడానికి కారణం పల్లవి అని చెప్పొచ్చని, సీన్ పూర్తవగానే వెంటనే మానిటర్ దగ్గరకెళ్లి అది బాగా వచ్చిందో లేదో చూసి బాలేకపోతే మరోసారి రీటేక్ చేద్దామంటుందని, ఆమెకు వర్క్ పట్ల అంతటి అంకితభావం ఉందని నాగ చైతన్య తెలిపాడు.
పల్లవి తనకొక మంచి స్నేహితురాలని చెప్తున్నాడు శర్వానంద్. సాయి పల్లవికి భక్తి చాలా ఎక్కువని, గుడికెళ్దామంటే చాలు ఏమీ అడక్కుండా వచ్చేస్తుందని, పడి పడి లేచే మనసు టైమ్ లో తనతో కలిసి చాలా గుళ్లకు వెళ్లినట్టు చెప్పిన తాను, సీన్ చేసేముందు దాన్ని డిస్కస్ చేసి ఇంకా ఎలా బాగా చేయాలో చెప్పేదని, తన జడ్జమెంట్ బావుంటుందని చెప్పాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అయితే సాయి పల్లవిని ఆకాశానికెత్తేశాడు. తన కెరీర్లో సాయి పల్లవి లాంటి నటిని ఇప్పటివరకు చూడలేదని, కొన్ని సీన్స్ లో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చూసి చాలా షాకయ్యేవాడినని చెప్పాడు. సీన్ ఎంత బాగా వచ్చినా సరే దాన్ని ఇంకా బెటర్ గా చేయాలని చూస్తుందని, అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్లు చాలా అరుదని తెలిపాడు.
నేచురల్ స్టార్ అని, ఇంట్లో అబ్బాయిలా ఉంటావని అందరూ నన్నంటారు. కానీ తనకు సాయి పల్లవిని చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతుందని నాని చెప్పాడు. శ్యామ్ సింగరాయ్ లోని సాంగ్ లో పల్లవి డ్యాన్స్ చేస్తుంటే తాను ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోవాలనేది సీన్. కానీ అది షూటింగ్ అని మర్చిపోయి నిజంగానే తన డ్యాన్స్ ను కళ్లార్పకుండా చూస్తుండిపోయానని, పల్లవి అంతలా మ్యాజిక్ చేసేదని, తన వల్ల ఏ చిన్న తప్పు జరిగినా దానికి వంద సార్లు సారీ చెప్పేదని నాని తెలిపాడు.
అమరన్ సినిమాలో సాయి పల్లవితో కలిసి నటించిన శివ కార్తికేయన్ ఆమె గురించి చెప్తూ తనకు ముందు నుంచే సాయి పల్లవితో పరిచయముందని, గతంలో తాను ఓ ఛానెల్ లో పని చేస్తున్నప్పుడు తన షోకు ఆమె వచ్చిందని, ఆ తర్వాత ప్రేమమ్ చూసి ఆశ్చర్యంగా అనిపించి వెంటనే ఫోన్ చేసి బాగా చేశావని చెప్తే థాంక్యూ అన్నా అని ఠక్కున అనేసిందని, తానలా పిలిచినందుకు అప్పట్లో ఫీలయ్యానని చెప్పాడు.