Begin typing your search above and press return to search.

గమనించారా మన హీరోయిన్స్ లో కొత్త చేంజ్!

సాధారణంగా సినిమాలంటే అందరూ హీరోల గురించే మాట్లాడుకుంటారు. కానీ అప్పుడప్పుడు హీరోయిన్ల గురించి మాట్లాడుకునే స్త్రీ ప్రాధాన్యత చిత్రాలు కూడా వస్తుంటాయి

By:  Tupaki Desk   |   24 Jun 2024 11:30 PM GMT
గమనించారా మన హీరోయిన్స్ లో కొత్త చేంజ్!
X

సాధారణంగా సినిమాలంటే అందరూ హీరోల గురించే మాట్లాడుకుంటారు. కానీ అప్పుడప్పుడు హీరోయిన్ల గురించి మాట్లాడుకునే స్త్రీ ప్రాధాన్యత చిత్రాలు కూడా వస్తుంటాయి. తెలుగులో ఇటీవల కాలంలో మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఊపందుకుంటున్నాయి. టాలీవుడ్ అగ్ర కథానాయికలంతా ఇప్పుడు శక్తివంతమైన మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ కంటెంట్ మూవీస్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మన హీరోయిన్ల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

'అరుంధతి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ప్రస్తుతం 'ఘాటీ' అనే సినిమాలో నటిస్తోంది. ఇది స్వీటీ కెరీర్ లో మైలురాయి 50వ చిత్రం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ప్రీ లుక్ పోస్టర్ లో అనుష్క ఫేస్ ను రివీల్ చెయ్యలేదు కానీ, ఇందులో ఆమె పాత్ర రఫ్ అండ్ టఫ్ గా వుంటుందని టాక్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పటి వరకూ ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చింది. ఇప్పుడు కాస్త ట్రాక్ మార్చి, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా 'రెయిన్ బో' మూవీలో నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించే ఈ తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమాకి శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటుగా 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇవి కాకుండా పుష్ప 2, సికిందర్ లాంటి భారీ ప్రాజెక్ట్స్ రష్మీక చేతిలో ఉన్నాయి.

'టిల్లు స్క్వేర్' సినిమాతో అందాల గేట్లు తెరిచేసిన ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మనసు మళ్లించింది. 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో 'పరదా' అనే మహిళా ప్రధాన సినిమాలో నటిస్తోంది. అలానే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతో 'ఆక్టోపస్' మూవీ చేస్తోంది. ఈ రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటుగా బైసన్, JSK, పెట్ డిటెక్టివ్ వంటి మరో మూడు చిత్రాల్లో అనుపమ హీరోయిన్ గా నటిస్తోంది.

మహానటితో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న అందాల భామ కీర్తి సురేష్.. అవకాశం వచ్చినప్పుడల్లా స్త్రీ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లో 'కన్నివేది' సినిమా చేస్తూనే.. 'రఘుతాత', 'రివాల్వర్ రీటా' లాంటి మరో రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేస్తొంది. ఇదే క్రమంలో తేరి రీమేక్ గా తెరకెక్కుతున్న 'బేబీ జాన్' మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధమైంది కీర్తి.

రీసెంట్ గా 'సత్యభామ' చిత్రంతో పోలీసాఫీసర్ గా ప్రేక్షకులను అలరించిన చందమామ కాజల్ అగర్వాల్.. 'ఉమ' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించింది. ఈ మధ్య 'బాక్' మూవీతో భయపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ప్రస్తుతం డైరెక్టర్ సంపత్ నందితో 'ఓదెల 2' మూవీ చేస్తోంది. ఇది 'ఓదెల రైల్వే స్టేషన్' కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో హెబ్బా పటేల్ కూడా కనిపించనుంది.

ఓ బేబీ, యశోద చిత్రాలతో సత్తా చాటిన సమంత రూత్ ప్రభు.. శాకుంతలం సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఆరోగ్య సమస్యల వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న సామ్.. ఇటీవల తన పుట్టినరోజున 'మా ఇంటి బంగారం' అనే పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని ప్రకటించింది. ఇది తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ లో నిర్మాణం జరుపుకుంటోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార లాంటి మరికొందరు హీరోయిన్లు స్త్రీ శక్తికి పట్టం కట్టే సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.