Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బ్రాండ్.. మరోసారి గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్

ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మెగా మల్టీస్టారర్ RRR సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది

By:  Tupaki Desk   |   5 Feb 2025 12:34 PM GMT
ఎన్టీఆర్ బ్రాండ్.. మరోసారి గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మెగా మల్టీస్టారర్ RRR సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సినిమా థియేటర్లలో రికార్డులను తిరగరాసిన తర్వాత ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ భారీ వ్యూస్‌ను సాధించింది. అంతేకాదు, ఆస్కార్‌ అవార్డు గెలిచిన నాటు నాటు పాటతో ఎన్టీఆర్ చరణ్ ట్యాగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో మరింతగా చర్చనీయాంశమయ్యాయి.

ఇక RRR తర్వాత ఎన్టీఆర్ పాన్ వరల్డ్ లెవెల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ సినిమా ఇంటర్వెల్ సీన్ కు విదేశీయులు కూడా ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రముఖులు ఎన్టీఆర్ టాలెంట్‌ను పొగుడుతూ పోస్ట్‌లు చేశారు. అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఫుట్‌బాల్ టాప్‌లో ఉంటుంది. ఆ క్రమంలోనే ఫిఫా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో ఒక్కసారిగా హాట్ డిస్కషన్ మొదలైంది. తాజాగా ఫిఫా ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి ఫుట్‌బాల్ స్టార్స్ నేమార్, టెవెజ్, రొనాల్డోలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. అందులో RRR ఫేమస్ సీన్ నుండి నాటు నాటు పాటలో ఎన్టీఆర్ స్టెప్‌ను స్టిల్‌గా ఉంచి, పక్కన నేమార్, టెవెజ్, రొనాల్డో పేర్లను ట్యాగ్ చేశారు.

దీంతో ఫుట్‌బాల్ ప్రేమికులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక తెలుగు హీరో పేరు అంతటి ప్రతిష్టాత్మకమైన ఫిఫా హ్యాండిల్‌లో కనిపించడం చాలా అరుదైన విషయం. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ఎన్టీఆర్ కూడా తనదైన స్టైల్లో ఫన్నీ రిప్లై ఇచ్చారు. “హహ హ్యాపీ బర్త్ నేమార్, టెవెజ్, రొనాల్డో” అంటూ ఓ సరదాగా కామెంట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమదైన రీతిలో ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ ట్రెండ్ చేశారు.

ఫిఫా అధికారికంగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి గర్వకారణంగా మారింది. ఇప్పటికే RRR సినిమాతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఫిఫా వంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ తన పేరు ప్రస్తావించడంతో, ఇకపై ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఆయన హాలీవుడ్ స్థాయిలో కూడా సినిమాలు చేయొచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఒక భారీ పాన్ ఇండియా సినిమాకు కూడా సైన్ చేశాడు. మొత్తం మీద, ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఇండియా లిమిటెడ్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లిపోయిందని ఈ ఫిఫా పోస్టు మరోసారి నిరూపించింది.