ఆయన రివ్యూతోనైనా 'పైటర్' లేస్తాడా?
శత్రు దేశం పాకిస్తాన్ కి వ్యతిరేకంగా బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అవన్నీ మంచి ఫలితాలు సాధించాయి
By: Tupaki Desk | 25 Jan 2024 6:43 AM GMTశత్రు దేశం పాకిస్తాన్ కి వ్యతిరేకంగా బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అవన్నీ మంచి ఫలితాలు సాధించాయి. ప్రతీ భారతీయుడు పాక్ వ్యతిరేక చిత్రాన్ని ఎంతో ఆదరించారు. కానీ 'ఫైటర్' విషయంలో ప్రేక్షకుల్లో ఆ పాజిటివ్ యాంగిల్ ఎక్కడా కనిపించడం లేదనే వినిపిస్తుంది. నేడు హృతిక్ రోషన్- దీపికా పదుకొణే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఫైటర్' ఇండియా సహా మరికొన్ని దేశాల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే గల్ప్ దేశాలు మాత్రం ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఫైటర్ కి జీ సీసీ సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో రిలీజ్ అవ్వలేదు. దీంతో సినిమాకి భారీ ఎత్తున నష్టం వస్తున్నట్లు ట్రేడ్ అంచనా వేస్తుంది. ఆయాదేశాల్లో రిలీజ్ కాకపోవడం సహా సినిమాకి అంత పాజిటివ్ బజ్ కూడా లేకపోవడంతో దాదాపు 60-80 కోట్ల వసూళ్లపై ప్రభావం పడుతుం దని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ప్రచార చిత్రాలతో పెద్దగా బజ్ ని తీసుకురావడంలో విఫలమైంది.
తొలి నుంచి ఈ సినిమాపై నెగిటివ్ గానే టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇటీవల రిలీజ్ అయిన న 'గదర్' తరహాలో పాకిస్థాన్‌ను ద్వేషించే సన్నివేశాలు సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అది గదర్ కి బాగా కలిసొ చ్చింది. అంతకు ముందు మరికొన్ని పాకిస్తాన్ వ్యతికేర సినిమాలకు కలిసొచ్చిన అంశంగానే కనిపిం చింది. కానీ పైటర్ విషయంలో మాత్రం ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతున్నట్లు కనిపించలేదు. గల్ప్ దేశాలు సినిమాని ముందుగానే బ్యాన్ చేయడం...ఇండియాలో సైతం పెద్దగా బజ్ లేకపోవడంతో మొత్తంగా ఫైటర్ పై తొలిరోజు గట్టిగానే పంచ్ పడినట్లు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ సినిమా కి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ మంచి రేటింగ్ ఇవ్వడం విశేషం. సినిమాకి ఏకంగా నాలుగున్నర రేటింగ్ ఇచ్చి ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రంగా అభివర్ణించారు. దీంతో ఫైటర్ కి వచ్చిన తొలి పాజిటివ్ రివ్యూ సహా సైన్ అనొచ్చు. రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫైటర్ హడావుడి కాస్త కనిపించే అవకాశం ఉంది. దేశ భక్తి నేపథ్యంగల సినిమా కావడంతో రిపబ్లిక్ డే కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఎలాగూ సెలవు దినం మార్కెట్ లో కూడా బాలీవుడ్ హీరోల సినిమాలు కూడా లేవు.