Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : 'ఫైటర్' రొమాంటిక్ యాంగిల్ చూశారా

'ఫైటర్‌' సినిమాలోని ఇష్క్‌ జైసా కుచ్‌ అనే పాటను క్రిస్టమస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 5:30 AM GMT
పిక్ టాక్ : ఫైటర్ రొమాంటిక్ యాంగిల్ చూశారా
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'ఫైటర్‌'. కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాను వచ్చే నెల 25న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో పాట విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.


'ఫైటర్‌' సినిమాలోని ఇష్క్‌ జైసా కుచ్‌ అనే పాటను క్రిస్టమస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. పాట రిలీజ్‌ కు సంబంధించిన ఒక పోస్టర్‌ ను సోషల్‌ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌ సభ్యులు షేర్‌ చేయడం జరిగింది. చలికాలంలో వేడి పుట్టించే విధంగా ఈ పోస్టర్ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగానే హృతిక్‌ రోషన్ అంటే అమ్మాయిలు పడి చస్తారు. ఇక దీపికా పదుకొనే కి పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో, ఆమె అందాన్ని ఏ స్థాయిలో ఆరాధిస్తారో అందరికి తెల్సిందే. అలాంటి ఇద్దరు కలిసి ఇలాంటి ఒక రొమాంటిక్ ఫోజ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఫైటర్‌ పై అందరి దృష్టి పడింది.

గత కొన్ని రోజులుగా డంకీ మరియు సలార్‌ కి సంబంధించిన హడావుడి తో విసిగి పోయిన నెటిజన్స్ కి ఒక రొమాంటిక్ టచ్ ఉన్న ఈ పోస్టర్‌ రావడంతో కాస్త డిఫరెంట్‌ గా ఫీల్ అయ్యి తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఫైటర్ సినిమా తో హృతిక్‌ రోషన్ కి ఓ స్ట్రాంగ్‌ మాస్ కమర్షియల్‌ హిట్ ను సిద్దార్థ్ ఆనంద్ ఇవ్వబోతున్నాడు అని నమ్మకం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఈ పోస్టర్‌ తో మరింతగా నమ్మకం పెంచుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఫైటర్ సినిమా లో హృతిక్, దీపికాల రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ పోస్టర్ చెప్పకనే చెబుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.