Begin typing your search above and press return to search.

ఫైటర్.. టీజర్ తో వచ్చింది సాంగ్ తో పోయేలా ఉంది

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ఆగ్రహిరులలో మంచి డాన్సర్ గా గుర్తింపు అందుకున్నాడు హృతిక్ రోషన్

By:  Tupaki Desk   |   15 Dec 2023 9:54 AM GMT
ఫైటర్.. టీజర్ తో వచ్చింది సాంగ్ తో పోయేలా ఉంది
X

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ఆగ్రహిరులలో మంచి డాన్సర్ గా గుర్తింపు అందుకున్నాడు హృతిక్ రోషన్. అలాగే యాక్షన్ సన్నివేశాలతో కూడా ఈ కండల వీరుడు ఆడియోన్స్ కు మంచి కిక్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక ఈసారి అతని నుంచి రాబోతున్న సినిమా ఫైటర్. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫిలిం గా రాబోతున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు.


ఈ సినిమాపై ఇప్పటికే టీజర్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా విజువల్స్ ఉండబోతున్నట్లుగా టీజర్ అయితే విడుదల చేశారు. ఇక ఆ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక రాబోయే అప్డేట్స్ తో ఇంకా ఎలాంటి కిక్ ఇస్తారో అని ఓవర్గం ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

కానీ రీసెంట్ గా విడుదల చేసిన ఒక సాంగ్ అయితే అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫైటర్ సినిమాకు సంబంధించిన ఒక పబ్ పార్టీ సాంగ్ విడుదల చేశారు. షేర్ కుల్ గయ అనే ఈ పాటలో దీపిక పదుకొనే తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అదేమి అంత కొత్తగా అనిపించలేదు. ఇక హృతిక్ రోషన్ డాన్స్ స్టెప్పులు మంచి టైమింగ్తో ఉన్నప్పటికీ గతంలో కంటే బెస్ట్ అనేలా ఇంపాక్ట్ చూపించలేదని కామెంట్స్ వస్తున్నాయి.

ఒక విధంగా ఇప్పటివరకు సినిమా టీజర్ ద్వారానే కావలసినంత పాజిటివ్ హైప్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సాంగ్ ద్వారా ఉన్న బజ్ పోయేలా ఉంది అన్నట్లుగా కూడా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. షేర్ కుల్ గయ.. పాట హై లెవెల్లో బాగుందని చెప్పలేము కానీ హృతిక్ రోషన్ నుంచి మాత్రం ఇలాంటి నార్మల్ సాంగ్ ఎక్స్ పెక్ట్ చేయలేదు అని ఎలా మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే హృతిక్ రోషన్ ఎలాంటి పాటకు అయినా సరే సింపుల్ స్టెప్స్ తోనే సాంగ్ ను బాగా ఎలివేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి విశాల్ శేఖర్ మ్యూజిక్ కు హృతిక్ రోషన్ స్టెప్పులు మరోసారి చూడాలని అనిపించనే లేదని అంటున్నారు. మరి సినిమా విడుదల అనంతరం వెండితెరపై ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థల పై ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక 2024 జనవరి 25న గ్రాండ్ గా ఫైటర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.