ఫైటర్ థీమ్ సాంగ్: భారత వైమానిక దళం పోరాట స్ఫూర్తితో
హీర్ ఆస్మానీ టీజర్ దేశభక్తిని రగిలించే పాట. మన దేశాన్ని రక్షించే ఫైటర్ పైలట్‌లకు సంబంధించిన గీతమిది. భారత వైమానిక దళం పరాక్రమాన్ని ఎలివేట్ చేసేలా దీనిని రూపొందించారు.
By: Tupaki Desk | 7 Jan 2024 6:11 AM GMTవార్- పఠాన్ చిత్రాలతో సంచలన విజయాలు సాధించిన సిద్ధార్థ్ ఆనంద్ తదుపరి వెంచర్ ఫైటర్ ఇప్పటికే క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే. భారతదేశంలో మొదటి ప్రధాన వైమానిక యాక్షన్ చిత్రమిది. హృతిక్ రోషన్- దీపిక పదుకొనే తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం 2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాల్లో ఒకటి. ఇటీవల ఫైటర్ డ్యాన్స్ ట్రాక్ 'షేర్ ఖుల్ గయే'.. రొమాంటిక్ సాంగ్ 'ఇష్క్ జైసా కుచ్'లో విడుదలై అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. పెప్పీ నంబర్‌లకు అద్భుత స్పందన వచ్చింది. భారతీయ వైమానిక దళం స్ఫూర్తిని సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన 'హీర్ ఆస్మానీ' పైలట్ థీమ్ సాంగ్ టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.
హీర్ ఆస్మానీ టీజర్ దేశభక్తిని రగిలించే పాట. మన దేశాన్ని రక్షించే ఫైటర్ పైలట్‌లకు సంబంధించిన గీతమిది. భారత వైమానిక దళం పరాక్రమాన్ని ఎలివేట్ చేసేలా దీనిని రూపొందించారు. హృతిక్, దీపికలతో పాటు ఇతర తారాగణం అంతా టీజర్‌లో కనిపించారు. ముఖ్యంగా ఫైటర్ జెట్‌లను రన్నింగ్ ట్రాక్ పైకి తీసుకెళుతున్న హృతిక్ - దీపిక విజువల్స్ ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. జనవరి 8న అంటే సోమవారం పూర్తి పాట విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్‌ను సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ పోస్ట్ చేసారు. #FighterOn25thJanన విడుదలవుతుందని ప్రకటించారు.
ఈ చిత్రాన్ని మార్ఫ్లిక్స్ పిక్చర్స్‌తో కలిసి వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పించింది. హృదయాన్ని కదిలించే యాక్షన్ దేశభక్తి నేపథ్యంలోని ఈ సినిమాతో సిద్ధార్థ్ ఆనంద్ భారీ విజయంపై కన్నేసారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పాత్రలో నటించారు.
టాప్ గన్ స్ఫూర్తితో..?
ఫైటర్ సినిమాని ప్రకటించే క్రమంలోనే హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కరోనా క్రైసిస్ లోను అద్భుత వసూళ్లను దక్కించుకున్న చిత్రమిది. ఇప్పుడు అదే తరహా కాన్సెప్ట్ తో ఇండియన్ వెర్షన్ గా ఫైటర్ కథాంశం ఉండనుందని టాక్ వినిపిస్తోంది.