ఫైటర్ ట్రైలర్: దాయాది పాక్ ఉగ్ర కుట్రలపై ప్రతీకార దాడి
అనిల్ కపూర్, హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారతదేశపు మొట్టమొదటి 'ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్'గా ప్రచారంలో ఉంది.
By: Tupaki Desk | 15 Jan 2024 9:37 AM GMTదాయాదుల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. దాడికి ప్రతిదాడి వీక్షకుల కోణంలో ఎంతో ఎగ్జయిట్ చేసే అంశం. ఇప్పుడు ఫైటర్ ట్రైలర్ లో ఇది ఆవిష్కృతమైంది. భూమార్గంలో పోరాటాలు, పర్వత శ్రేణుల్లో గొరిల్లా పోరాటాలు.. సముద్ర మార్గంలో యుద్ధాలు.. వీటన్నిటి కంటే భిన్నమైన వైమానిక దళ దాడుల నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ కలిగించనుందని తాజా ట్రైలర్ చెబుతోంది.
ఫైటర్ మేకర్స్ గ్రాండ్ ట్రైలర్‌ను సంక్రాంతి కానుకగా, సోమవారం నాడు విడుదల చేశారు. అనిల్ కపూర్, హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారతదేశపు మొట్టమొదటి 'ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్'గా ప్రచారంలో ఉంది. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. హృతిక్ పాటీ ఫైటర్ అంటే ఏంటో నిజమైన అర్ధాన్ని వివరిస్తాడు. ''ఫైటర్ వో నహీ జో అప్నే టార్గెట్స్ అచీవ్ కర్తా హై, ఫైటర్ వో హై జో అన్హే థోక్ దేతా హై'' అని డైలాగ్ చెబుతున్నాడు. భారతదేశం vs పాకిస్తాన్ నేపథ్యంలో సాగే కథాంశమిదని దీంతో స్పష్ఠత వస్తుంది. యుద్ధంలో ఫైటర్ జెట్‌లు ఒకదానికొకటి వెంబడించే విజువల్స్ ఆద్యంతం రక్తి కట్టించాయి. హృతిక్- దీపిక గాల్లో విన్యాసాలకు పల్పడే ఏవియేటర్లుగా నటించారు.
ఆ ఇద్దరూ కథనరంగంలో వీరులుగా కనిపిస్తారు. అపరిమితమైన రొమాన్స్ తోను మనసులు దోచేస్తున్నారు. వారు ఎదుటపడినప్పుడు మొదట ఒకరినొకరు అహంకారులుగా భావిస్తారు. కానీ నెమ్మదిగా ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఇక ప్రధాన థీమ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ యుగయుగాలుగా చేస్తున్న సైనికుల హత్యలకు ప్రతీకారం తీర్చుకునేలా యోధులను ప్రేరేపించే దేశ వైమానిక దళ వీరుల కథ ఇది. దేశ ప్రధానిని ఈ ట్రైలర్ లో చూపారు. 2019 ఉగ్రదాడిలో మరణించిన 14 మంది సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మన వైమానిక దళాలు సన్నద్ధమవుతున్న తరుణంలో పుల్వామా దాడి ప్రధాన దశకు చేరుకుంటుంది. ఫైటర్లు తమ శత్రువులపై కఠినంగా వ్యవహరించడం.. పాకిస్తాన్ ఎదురుదాడికి దిగడం వగైరా విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఒక సన్నివేశంలో, హృతిక్ పాటీ పాక్ ఆర్మీ సిబ్బందిని తరిమి కొట్టినప్పుడు భారతదేశం ఏ రోజున తమ దేశాన్ని ఎలా నియంత్రించగలదో చెప్పే డైలాగ్ ఉద్విగ్నంగా సాగుతుంది.
ఫైటర్ కథ నిజానికి జరిగిన కథ. ఐదేళ్ల క్రితం జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో ఒక నిజ సంఘటనను క్యాష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలా అనిపిస్తుంది. మొత్తం మూడు నిమిషాల తొమ్మిది సెకన్ల ట్రైలర్‌లో హృతిక్ పాత్ర ప్రధానంగా హైలైట్ గా సాగుతుంది. దీపిక యాక్షన్‌లో అంతగా కనిపించలేదు. అక్షయ్ ఒబెరాయ్ పాత్రను చూపించారు. కానీ ఫైటర్‌తో పెద్ద స్క్రీన్‌కి తిరిగి వస్తున్న కరణ్ సింగ్ గ్రోవర్ పాత్ర ఆసక్తిని కలిగిస్తోంది. అపరిమితమైన వీఎఫ్‌ఎక్స్ వర్క్‌తో ట్రైలర్ నిండిపోయింది. ముఖ్యంగా 2022లో విక్రమ్ వేద తర్వాత హృతిక్ కనిపించడం ఇదే తొలిసారి. 2019లో వార్ తర్వాత అతడికి మొదటి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ చిత్రమిది. ఫైటర్ కోసం ఎంచుకున్న కథాంశం చాలా అంచనాలను పెంచుతోంది. పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఫైటర్ ఈ ఏడాది జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది.