Begin typing your search above and press return to search.

హృతిక్-తార‌క్ మ‌ధ్య భారీ పోరాటాలు!

`వార్ -2` కోసం హృతిక్ రోష‌న్..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Nov 2023 5:39 AM GMT
హృతిక్-తార‌క్ మ‌ధ్య భారీ పోరాటాలు!
X

`వార్ -2` కోసం హృతిక్ రోష‌న్..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న సినిమా షూట్ లో టైగ‌ర్..హృతిక్ ఎప్పుడైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు పాత్ర‌లు ఎంత బ‌లంగా ఉంటాయ‌ని వారు సెట్స్ కి వెళ్ల‌క‌ముందే అభిమానుల ఊహంక‌ద‌ని విధంగా హైప్ క్రియేట్ అవుతుంది. ఇక సెట్స్ లో కాలు పెట్టిన త‌ర్వాత స‌న్నివేశం ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇప్ప‌టికే టైగర్ కోసం యుద్ద భూమిలో ఎదురు చూస్తున్నానంటూ హృతిక్ చేసిన పోస్ట్ అభిమానుల్లో అంత కంత‌కు హీట్ పెంచింది. తాజాగా య‌శ్ రాజ్ ఫిలింస్ మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తో ముందుకొచ్చేసింది. `వార్ -2.. ఆగ‌స్టు 14..2025 లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్..హృతిక్ మ‌ధ్య ముఖాముఖి పోరాట స‌న్నివేశాలు చూడ‌టానికి సిద్దంగా ఉండండి అని రివీల్ చేసింది. దీంతో మ‌రోసారి టౌగ‌ర్ పాత్ర‌పై స్ప‌ష్ట‌త వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఇందులో తార‌క్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా? పాజిటివ్ రోల్ పోషిస్తున్నాడా? అన్న దానికై కొన్ని నెల‌లు గా స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. మెజార్టీ వ‌ర్గం తార‌క్ నెగిటివ్ ఛాయ‌లున్న పాత్ర పోషిస్తున్న‌ట్లు భావించింది. హృతిక్ పోస్ట్ కూడా మ‌ద్ద‌తుగా నిలిచింది. కానీ చిత్ర ద‌ర్శ‌కుడు గానీ...నిర్మాణ సంస్థ నుంచి ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ ఇవ్వ‌లేదు. తాజాగా య‌శ్ రాజ్ ఫిలింస్ నుంచి అధికారికంగా పోరాటానికి సిద్ద‌మ‌వ్వండి అంటూ హింట్ ఇవ్వ‌డంతో తార‌క్ పాత్ర ఎలా ఉంటుంద‌న్న‌ది దాదాపు ఖాయ‌మ‌వుతుంది.

హృతిక్- తార‌క్ మ‌ధ్య భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని తేలిపోయింది. మ‌రి ఆ ఇద్ద‌రు స్టార్ల‌ను ద‌ర్శ‌కుడు ఆయ‌న్ ముఖ‌ర్జీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? అన్న‌ది ఇక్క‌డ ఇంట్రెస్టింగ్. పాన్ ఇండియాలో తార‌క్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `ఆర్ ఆర్ ఆ`ర్ తో గ్రేట్ యాక్ట‌ర్ గా ప్రూవ్ చేసుకున్నారు. కానీ హృతిక్ తో యాక్ష‌న్ స‌న్నివేశాలంటే? ఇద్ద‌రి మ‌ధ్య హైట్ వ్య‌త్యాసం భారీగా ఉంటుంది. వాటిని చాలా క‌న్విన్సింగ్ గా చేయాల్సి ఉంటుంది. ఇంత‌వ‌ర‌కూ హృతిక్ తో త‌ల‌ప‌డ్డ స్టార్లు అంతా భారీ క‌టౌట్లే అన్న సంగ‌తి తెలిసిందే.