టాలీవుడ్ స్టార్ హీరోల కోసం అలాంటి ప్లాన్!
ఇలాంటి సమయంలో వారి కోసం ప్రత్యేకించి రెండువారాల పాటు సాగే ఒక ఫిలింఫెస్టివల్ ని ఇండివిడ్యువల్ గా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది?
By: Tupaki Desk | 13 March 2025 8:45 AM ISTదశాబ్ధాల పాటు తమ జీవితాన్ని సినీపరిశ్రమకే అంకితమిచ్చిన హీరోలు భారతదేశంలో ఎందరో. బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం, అమితాబ్ బచ్చన్, కపూర్ హీరోలు ఈ తరహానే. ఇంకా ఎందరో లెజెండరీ స్టార్లు పరిశ్రమకు అంకితమయ్యారు. అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్లు దశాబ్ధాల పాటు సినీరంగానికి అంకితమై పని చేసారు. కోలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ లోను సీనియర్ స్టార్లు దశాబ్ధాల పాటు కెరీర్ ని సాగించారు. వారి కెరీర్ లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ రికార్డ్ హిట్లు ఉన్నాయి.
అయితే ఈ హీరోలంతా ఇప్పుడు 60లు దాటుకుని చాలా దూరం వచ్చేసారు. ఇలాంటి సమయంలో వారి కోసం ప్రత్యేకించి రెండువారాల పాటు సాగే ఒక ఫిలింఫెస్టివల్ ని ఇండివిడ్యువల్ గా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇటీవల అమీర్ ఖాన్ కోసం అలాంటి సెలబ్రేషన్ ని ప్లాన్ చేసింది పీవీఆర్. ఇది ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. అమీర్ ఖాన్ నటించిన మొదటి సినిమా సహా కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను మార్చి 14 నుంచి మార్చి 27 వరకూ సాగే సినిమా ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవాల కోసం అమీర్ ఖాన్ ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఆన్ లైన్ బుకింగుల్లో రెస్పాన్స్ బావుంది.
అయితే ఇది పొరుగు భాషల్లోని స్టార్ల అభిమానుల్లోను ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో ఎందరో దిగ్గజ హీరోలు ఉన్నారు. దివంగత హీరోల్లోను ప్రముఖులకు భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వారి సినిమాలను తిరిగి రిలీజ్ చేస్తే థియేటర్లకు వెళ్లి చూడాలనుకునే వీరాభిమానులకు కొదవేమీ లేదు. దశాబ్ధాల కెరీర్ లో మరపురాని సినిమాలెన్నిటినో అందించిన స్టార్ల కోసం ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ అభినందనీయం. ప్రస్తుతం పాపులర్ స్టార్ల సినిమాలు రీరిలీజ్ అయి, హిట్లు కొడుతుంటే కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. రెండు వారాల పాటు ప్రత్యేకించి అభిమాన తారల సినిమాలను వీక్షించేందుకు అభిమానుల్లో ఉత్సాహం తగ్గదు. సినిమాల ఉత్సవాలను వారు ఆస్వాధించేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ అలాంటి ప్రయత్నం దక్షిణాదినా మొదలవుతుందనే ఆశిద్దాం.