Begin typing your search above and press return to search.

పుష్ప 2 - ఫస్ట్ చూసిన పర్సన్ ఎవరంటే..

కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా అందరి అటెంక్షన్‌ను లాక్కుంటూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   24 Oct 2024 12:14 PM GMT
పుష్ప 2 - ఫస్ట్ చూసిన పర్సన్ ఎవరంటే..
X

సాధారణంగా అన్ని సినిమా పరిశ్రమల నుంచి ఎన్నో చిత్రాలు తెరకెక్కుతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా అందరి అటెంక్షన్‌ను లాక్కుంటూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘పుష్ప ది రూల్’ (పుష్ప 2) ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం గతంలో సెన్సేషన్ అయిన 'పుష్ప ది రైజ్’కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే.

మొదటి భాగం సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప ది రూల్’పై అంచనాలు తారాస్థాయిలోనే నెలకొన్నాయి. వాటిని నిలబెట్టుకునేలా సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.

వాస్తవానికి ‘పుష్ప ది రూల్’ సినిమాను ఆగస్టులోనే విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ, అప్పుడు వీలు కాకపోవడంతో డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా డేట్‌ను మార్చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను మరింత ఖుషీ చేసేలా ‘పుష్ప ది రూల్’ సినిమాను డిసెంబర్ 5వ తేదీనే విడుదల చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను కూడా వదిలింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘పుష్ప ది రూల్’ సినిమా నుంచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రాన్ని మొట్టమొదటిసారిగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళినే వీక్షించారని ఓ న్యూస్ లీక్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌కు ఆయన ఓ సందర్భంలో హాజరయ్యారట. అక్కడ సుకుమార్ ఈ సినిమా విశేషాలు చెప్పారని సమాచారం.

మహేశ్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న రాజమౌళి.. ‘పుష్ప ది రూల్’ సినిమా రషెష్ చూసి అవాక్కయ్యారని తెలిసింది. అంతేకాదు, ఇందులో కొన్ని సీక్వెన్స్‌లు ఆయనను ఫిదా చేశాయని అంటున్నారు. అలా అల్లు అర్జున్ సినిమాను మొదటిసారిగా రాజమౌళినే వీక్షించినట్లు అయింది. దర్శకధీరుడినే మెప్పించిన సినిమా అంటూ అప్పుడే బన్నీ ఫ్యాన్స్ ఈ న్యూస్‌ను వైరల్ చేసేస్తున్నారు.

సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప ది రూల్’ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.