Begin typing your search above and press return to search.

ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్ 2023 జాబితా

ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్ 2023లో ఆలియా వెలుగులు ప్ర‌స‌రించాయి. 'డార్లింగ్స్‌'లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటి (వెబ్ ఒరిజిన‌ల్ విభాగం)గా పుర‌స్కారం అందుకుంది

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:16 PM GMT
ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్ 2023 జాబితా
X

ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్ 2023లో ఆలియా వెలుగులు ప్ర‌స‌రించాయి. 'డార్లింగ్స్‌'లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటి (వెబ్ ఒరిజిన‌ల్ విభాగం)గా పుర‌స్కారం అందుకుంది. ఆమె సోదరి షాహీన్ భట్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నటి షాహీన్, డార్లింగ్స్ డైరెక్టర్ జస్మీత్ కె రీన్, సహనటుడు విజయ్ వర్మతో క‌లిసి వేదిక‌పై ఆనందాన్ని పంచుకుంది. వైవిధ్య‌మైన‌ పాత్రలతో మెప్పిస్తున్న విజయ్ వర్మ, అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ 'దహాద్‌'లో తన అద్భుతమైన నటనకు అవార్డును కైవసం చేసుకున్నాడు. ఫిలింఫేర్ OTT అవార్డ్స్‌లో వీరిద్దరూ సాధించిన విజయం వారి కెరీర్‌లకు మరింత బూస్ట్ ఇవ్వ‌నుంది.

తాజాగా ముంబైలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్‌కు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదిక వ‌ద్ద‌ సురీందర్ విక్కీ, రాజశ్రీ దేశ్‌పాండే, కరిష్మా తన్నా వంటి నటీనటులు కోహ్రా, ట్రయల్ బై ఫైర్, స్కూప్ వంటి షోల‌లో తమ అద్భుతమైన ప్రదర్శనల కోసం హోమ్ ట్రోఫీలను తీసుకున్నారు. ట్రయల్ బై ఫైర్, జూబ్లీ ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్‌లో తమ మార్క్‌ను చూపాయి.

సాంకేతిక విభాగంలో పెద్ద విజయం సాధించడమే కాకుండా, విక్రమాదిత్య మోత్వానే ప్రైమ్ వీడియో సిరీస్ జూబ్లీ ఉత్తమ దర్శకుడు, సిరీస్ విభాగంలో అవార్డుల‌ను పొందింది. ఈ అవార్డుల్లో మరో పెద్ద విజేత TVF, దీని సిరీస్ ట్రిప్లింగ్ సీజన్ 2.. TVF పిచర్స్ సీజన్ 2 మొత్తం నాలుగు అవార్డులను పొందాయి. జూన్, 1997లో జరిగిన ఘోరమైన ఉపహార్ సినిమా అగ్నిప్రమాదం ఆధారంగా రూపొందిన‌ నెట్‌ఫ్లిక్స్ షో 'ట్రయల్ బై ఫైర్‌'లో తన అత్యుత్తమ పనికి రాజశ్రీ దేశ్‌పాండే ఉత్తమ నటి, సిరీస్ (ఆడ) డ్రామా పుర‌స్కారాన్ని గెలుచుకుంది. అభయ్ డియోల్-నటించిన సిరీస్ విమర్శకుల విభాగంలోను పుర‌స్కారం గెలుపొందింది.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కొహ్రా .. కరిష్మా తన్నా షో స్కూప్ అవార్డుల‌ను గెలుపొందాయి. సాంకేతిక విభాగంలో ప‌నిత‌నం స‌హా స్కూప్ రెండు ముఖ్యమైన విభాగాలలో గెలుచుకుంది. ఉత్తమ నటి (కరిష్మా తన్నా) ... ఉత్తమ సిరీస్ అవార్డులు ద‌క్కించుకుంది. కొహ్రా నాలుగు అవార్డులు (సాంకేతిక విభాగంలో గెలిచిన వాటితో పాటు).. ఉత్తమ దర్శకుడు, క్రిటిక్స్ (రణదీప్ ఝా) ఉత్తమ నటుడు, ఉత్త‌మ‌ సిరీస్ (సువీందర్ విక్కీ) .. ఉత్తమ సహాయ నటుడు (బరున్ సోబ్తి) అవార్డులు ద‌క్కాయి. ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 - దహాద్ పుర‌స్కారాల్ని అందుకున్నాయి.

ఫిలింఫేర్ ఓటీటీ పుర‌స్కార విజేత‌లు:

వెబ్‌సిరీస్‌ (డ్రామా) విభాగం:

ఉత్తమ దర్శకుడు : విక్రమాదిత్య మోత్వానీ (జూబ్లీ)

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) : రణ్‌దీప్‌ జా (కొహరా)

ఉత్తమ నటుడు : సువేంద్ర విక్కీ (కొహరా)

ఉత్తమ నటి : రాజశ్రీ దేశ్‌పాండే (ట్రైయిల్‌ బై ఫైర్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విజయ్‌ వర్మ (దహడ్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): కరిష్మా తన్నా (స్కూప్‌), సోనాక్షి సిన్హా (దహడ్‌)

ఉత్తమ సహాయ నటుడు: బరున్‌ సోబ్తి (కొహరా)

ఉత్తమ సహాయ నటి : తిలోత్తమ (దిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2)

వెబ్‌ సిరీస్‌ - కామెడీ

ఉత్తమ నటుడు : అభిషేక్‌ బెనర్జీ (ది గ్రేట్‌ వెడ్డింగ్స్‌ ఆఫ్‌ మున్నెస్)

ఉత్తమ నటి : మాన్వీ గాగ్రూ (టీవీఎఫ్‌ ట్రిప్లింగ్‌)

ఉత్తమ సహాయ నటుడు : అర్ణభ్‌ కుమార్‌ (టీవీఎఫ్‌ పిట్చర్స్‌)

ఉత్తమ సహాయ నటి : షెర్నాజ్ పటేల్ (టీవీఎఫ్‌ ట్రిప్లింగ్‌ సీజన్‌ 3)

ఉత్తమ కామెడీ సిరీస్‌ - టీవీఎఫ్‌ పిట్చర్స్‌ సీజన్‌ 2

ఉత్తమ నాన్‌ ఫిక్షనల్‌ ఒరిజినల్‌ - సినిమా మార్టే దమ్‌ తక్‌

వెబ్‌ ఒరిజినల్‌

ఉత్తమ వెబ్ ఒరిజినల్ - సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై

ఉత్తమ దర్శకుడు - అపూర్వ సింగ్‌ ఖర్కీ (సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై)

ఉత్తమ నటుడు : మనోజ్‌బాజ్‌ పాయ్‌ (సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై)

ఉత్తమ నటి : అలియా భట్‌ (డార్లింగ్స్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) : రాజ్‌కుమార్‌ రావ్‌ (మోనికా ఓ మై డార్లింగ్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): షర్మిలా ఠాకూర్‌ (గుల్మోహర్)

ఉత్తమ సహాయ నటుడు : సూరజ్‌ శర్మ(గుల్మోహర్)