విరాళం వెనుక సింపతీ కలిసొచ్చేదే!
ఇటీవలే ఓ యంగ్ హీరో భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో చిన్న చిన్న సహాయాలు చేసాడు గానీ భారీ విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి
By: Tupaki Desk | 7 Sep 2023 7:03 AM GMTఇటీవలే ఓ యంగ్ హీరో భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో చిన్న చిన్న సహాయాలు చేసాడు గానీ భారీ విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఆ హీరో తో సినిమా నిర్మించిన ఓ బ్యానర్ కూడా మా నష్టాలు కూడా పూడ్చండి అంటూచూ చెప్పుకొచ్చింది. మరి ఆ హీరో ఉన్నట్లుండి ఇలా సహాయం ప్రకటించ డం వెనుక కేవలం సామాజిక దృక్ఫదమే ఉందా? ఇంకేదైనా కోణం ఉందా? అంటూ నెట్టింట చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ అంశం వెలుగులోకి వస్తోంది. విరాళం వెనుక సింపతీ మార్కులు ఉన్నాయని అంటున్నారు. కొన్ని నెలలుగా ఆ హీరోపై సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువవుతోంది. యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ కొన్ని రకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఆ ప్రభావం తదుపరి రిలీజ్ పైనా పడింది. సినిమాపై నెగిటివ్ కామెంట్లు వైరల్ అయ్యాయి. డబ్బులిచ్చి మరీ నెగిటివ్ గా రివ్యూలు రాయించారని ఆహీరో ఆరోపించాడు.
అలాగే ఆ హీరోకి గాడ్ ఫాదర్ లా నేను ఉన్నానంటూ గతంలో చెప్పుకొచ్చిన పెద్దాయన కూడా ఇప్పుడా హీరోని లైట్ తీసుకున్నాడు. ఇలా కొన్ని సంకేతాలు ఆ హీరోని విరాళం వైపుగా మెగ్గు చూపించాయని పరిశ్రమ వర్గాల్లో చర్చకొస్తుంది. ఏదీ ఏమైనా వితరణ మంచి కార్యక్రమం. అందుకే ఆ హీరోని ప్రశింసించా ల్సిందే. తాను సంపాదించిన దాంట్లో కొంత ఇవ్వడంలో తప్పు లేదు.
సామాజిక దృక్ఫధంతో ముందుకొచ్చాడు. అలాంటి హీరోని చూసి మరింత మంది సహాయం అందించ డానికి అవకాశం ఉంటుంది. ఆ హీరో సినిమాలు సక్సస్ అయితే మరింత సహాయం దొరుకుతుంది. ప్రస్తుతం ఆ హీరో కెరీర్ పరంగా చూసుకోవాల్సిన పనిలేదు. చేతిలో అవకాశాలు బాగానే ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ లు బాగానే కనిపిస్తున్నాయి. తమిళ దర్శకులతోనూ ప్లాన్ చేస్తున్నారు.