Begin typing your search above and press return to search.

దేవర దెబ్బకు.. OG రేంజ్ పెరిగిందిగా..

గ్యాంగ్ స్టర్ గా పవన్ స్వాగ్ ను చూసేందుకు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 10:30 PM GMT
దేవర దెబ్బకు.. OG రేంజ్ పెరిగిందిగా..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీపై ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీపై ఆడియన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గ్యాంగ్‌ స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఓజీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్.. చూసి బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. గ్యాంగ్ స్టర్ గా పవన్ స్వాగ్ ను చూసేందుకు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్న ఓజీ మూవీ షూటింగ్.. ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయింది. వరుస షెడ్యూల్స్ లో స్పీడ్ గా షూట్ చేశారు మేకర్స్. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ బిజీగా మారడం వల్ల హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. షూటింగ్ పార్ట్ మాత్రం తక్కువే పెండింగ్ ఉంది. పవన్ డేట్స్ ఇస్తే.. కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మేకర్స్ ఇటీవల తెలిపారు. విజయవాడ పరిసరాల్లో త్వరలోనే షూట్ చేస్తామని ఓ ఇంటర్వ్యూలో దానయ్య చెప్పారు.

ఇది పక్కన పెడితే.. ఇప్పటికే ఓజీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. రూ.92 కోట్లకు నెట్ ఫిక్స్ సొంతం చేసుకుందని టాక్ వినిపించింది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ.110 కోట్లకు విక్రయించనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కానీ డీల్ ఫిక్స్ అవ్వకపోవడం మాత్రం నిజమే. అయితే దానయ్య.. రూ.110 కోట్లను ఇప్పుడు రూ.150 కోట్లకు పెంచేశారని రూమర్స్ వస్తున్నాయి.

అది కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ అయ్యాకనే పెంచారని సమాచారం. అయితే దేవర మూవీ రెండు రాష్ట్రాల హక్కులు రూ.120 కోట్లకు అమ్మినట్లు వినికిడి. నైజాంలో మూడు రోజుల్లో రూ.40 కోట్లు.. విశాఖ ఏరియాలో రూ.12 కోట్లు దేవర వసూలు చేసినట్లు టాక్. ఓవరాల్ గా నైజాంలో దేవర రూ.60 కోట్లు, ఏపీలో రూ.70 కోట్లకు కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని, థియేటర్ల ట్రెండ్ చూసి దానయ్య పెంచేశారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.