ఆ హీరో పార్టీ గురించే ఫిలింనగర్ గుసగుస
ఇక తమ సిబ్బందిని ఎంతో గౌరవంగా చూసుకునే స్టార్లు ఉన్నారు.
By: Tupaki Desk | 16 Dec 2023 7:20 AM GMTమంచి స్నేహం, సత్సంబంధాలు ఎల్లపుడూ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా మీడియాతో సన్నిహిత సంబంధాలు తమను నిరంతరం లైమ్ లైట్ లో ఉంచుతాయి. అందుకే నేటితరం నటీనటులు, హీరోలు, హీరోయిన్లు మీడియాతో సన్నిహితంగా మెలిగేందుకు ఇష్టపడతారు. ఇక తమ సిబ్బందిని ఎంతో గౌరవంగా చూసుకునే స్టార్లు ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని పార్టీలు ఇందుకు వేదికలుగాను మారుతుంటాయి.
ఇక పుట్టినరోజులు, కుటుంబ వేడుకలకు మీడియా ప్రతినిధులతో పాటు, తమ సహచరులను కూడా ఆహ్వానించడం, పరిశ్రమ ప్రముఖులను పార్టీకి పిలవడం ఇవన్నీ సహజంగా చూసేవే. టాలీవుడ్ అగ్ర హీరోలు, యువహీరోలు ప్రతియేటా బర్త్ డే పార్టీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. అందరితో సత్సంబంధాలను కొనసాగిస్తుంటారు. అదే తీరుగా ఇప్పుడు ఒక యువహీరో టాలీవుడ్ లో పార్టీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ పార్టీలో సహనటులు, యువ హీరోలు, ఔత్సాహిక తారలు కూడా పాల్గొన్నారు.
చివరికి తన డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు సహా చాలా మంది సిబ్బంది ఈ పార్టీలో కనిపించడంతో సదరు హీరో మంచి మనసు గురించి అంతా ముచ్చటించుకున్నారు. అలాగే ఈ పార్టీని ఒక రోజంతా కూల్ గా చిల్ చేసేలా ఎరేంజ్ చేయడంతో ట్వల్వ్ టు ట్వల్వ్ రౌండ్ ది క్లాక్.. డే అండ్ నైట్ అంతా ఎంజాయ్ చేసారన్నది ఇక్కడ గుసగుస. పార్టీలో అందరితో సదరు హీరో సన్నిహితంగా ఉన్నారు. తన ఒదిగి ఉండే స్వభావంతో ఆకట్టుకున్నారు. నిజానికి ఈ పార్టీ చాలామంది స్టార్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని, మంచి సంబంధాలను మెరుగుపరుచుకుని ఉత్తమమైన కెరీర్ కి బాటలు వేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు వేయాలో అతడిని చూసి నేర్చుకోవాలని కూడా ఫిలింనగర్ లో గుసగుస వినిపించింది.