చివరికి ఓటీటీలో డంకీ రిజల్ట్
పఠాన్-జవాన్- డంకీ లాంటి హ్యాట్రిక్ చిత్రాలతో కింగ్ ఖాన్ తాను ఎదురేలేని బాక్సాఫీస్ రారాజును అని నిరూపించాడు.
By: Tupaki Desk | 18 Feb 2024 1:25 PM GMTకింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీ క్రిటిక్స్ నుంచి విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ నంబర్ల పరంగా ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లతో ఖాన్ కళ్లలో ఆనందం నింపింది. పఠాన్-జవాన్- డంకీ లాంటి హ్యాట్రిక్ చిత్రాలతో కింగ్ ఖాన్ తాను ఎదురేలేని బాక్సాఫీస్ రారాజును అని నిరూపించాడు.
ఇప్పుడు `డంకీ` థియేట్రికల్ రన్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఇది భారతదేశం సహా 12 దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలలో టాప్ 10లో ఉంది. ఇది గొప్ప ప్రారంభంగా భావించాలి. ఈ సినిమా కుటుంబ సమేతంగా వీక్షించదగిన హాని చేయని సినిమా. ఎమోషనల్ ఎమోషనల్ డ్రామాలో లోపాలున్నప్పటికీ వీక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ రేంజు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా రేర్ ఫ్యామిలీ డ్రామాగా దీనిని చూస్తున్నారు.
డంకీ థియేట్రికల్ గా పెద్ద విజయం అందుకుంది. నెట్‌ఫ్లిక్స్ రైట్స్ కోసం భారీగా రూ.120 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మొదట రూ.155 కోట్లు అని ప్రచారం జరిగినా వాస్తవ డీల్ తక్కువే. డిజిటల్ విజయం కూడా సంతృప్తికరంగా రావడంతో షారూఖ్ - హిరాణీ బృందం ఆనందానికి అవధుల్లేవ్.