Begin typing your search above and press return to search.

అమితాబ్ బ‌చ్చన్ కు నెటిజన్ల "ఫైనల్" విన్నపం వైరల్!

ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, మరి ముఖ్యంగా టీం ఇండియా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నా అతిశయోక్తి కాదేమో.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:21 PM GMT
అమితాబ్  బ‌చ్చన్   కు నెటిజన్ల  ఫైనల్ విన్నపం వైరల్!
X

వ‌న్డే వరల్డ్ కప్ 2023లో టీం ఇండియా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఫలితంగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైన‌ల్‌ కు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆదివారం అహ్మదాబాద్‌ లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైన‌ల్ మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, మరి ముఖ్యంగా టీం ఇండియా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నా అతిశయోక్తి కాదేమో.

ఈ సమయంలో ఎవరి సెంటిమెంట్స్ వారు ఫాలో అవ్వడానికి సిద్ధపడుతున్నారు. టీం ఇండియా గతంలో గెలిచిన మ్యాచ్ లలో వర్కవుట్ అయిన సెంటిమెంట్స్ ని ఫైనల్ లోనూ కంటిన్యూ చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆ సెంటిమెంట్స్ లో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్, సినీ దిగ్గజం అమితాబ్ బ‌చ్చన్ కు ఒక రిక్వస్ట్ చేస్తున్నారు నెటిజన్లు!

అవును... ఆదివారం అహ్మదాబాద్ లో భారత్ ఆడబోతున్న ఫైనల్ మ్యాచ్ ను చూడొద్దని అమితాబ్ కు నెటీజ‌న్లు రిక్వస్ట్ లు పెడుతున్నారు. ఇందులో భాగంగా... ద‌య‌చేసి ఆదివారం (నవంబర్ 19) ఒక్క రోజు ఏదైన ప‌నిలో బిజీఅయిపోమన్ని చెబుతున్నారు. నెటీజ‌న్లు ఈస్థాయిలో బిగ్ బీ ని రిక్వస్ట్ చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. సెమీ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం అమితాబ్ చేసిన ట్వీటే!

వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ లో భార‌త్ విజ‌యం సాధించి గ్రాండ్ గా ఫైన‌ల్‌ కు చేరుకుంది. ఈ ప్రపంచ కప్ లో ఆడిన 10 మ్యాచ్ లలోనూ వరుసగా గెలిచిన రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో భార‌త జ‌ట్టుపై ప్రశంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అమితాబ్ ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... "నేను చూడ‌ని స‌మ‌యంలోనే మ‌నం గెలుస్తాం" అని అమితాబ్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. దీంతో బిగ్ బీ కి ఆన్ లైన్ వేదికగా రిక్వస్ట్లే రిక్వస్ట్లు. "ద‌య‌చేసి మీరు ఫైన‌ల్ మ్యాచ్ చూడ‌కండి సార్‌" అని వరుస కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా... "ఫైన‌ల్ మ్యాచ్ రోజు క‌ళ్లకు గంత‌లు క‌ట్టుకోవాల‌ని" ఒక నెటిజ‌న్ కోరగా... "ఆ మ్యాచ్ చూస్తే ఒట్టే" అంటూ మరొకరు కామెంట్ చేశారు!

మరి నెటిజన్ల కోరికను అమితాబ్ మన్నిస్తారా.. లేక, ట్రెండ్ మారుస్తారా అనేది వేచి చూడాలి. మరోపక్క వ‌న్డే ప్రపంచ‌క‌ప్ ఆరంభానికి ముందు బీసీసీఐ.. అమితాబ్ బ‌చ్చన్‌ కు గోల్డెన్ టికెట్‌ ను అందించింది. దీని ద్వారా ఎలాంటి టికెట్ కొనుగోలు చేయ‌కుండా ప్రపంచ‌క‌ప్ మ్యాచ్‌ లు జ‌రిగే స్టేడియాల్లోకి వెళ్లి వీఐపీ బాక్స్‌ లో కూర్చోని ప్రత్యక్షంగా మ్యాచ్‌ ను చూడొచ్చు.