మోసం ఫోర్జరీ కేసులో దర్శకుడిపై FIR
ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టార్లలో `బడే మియాన్ చోటే మియాన్` ఒకటి. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించారు.
By: Tupaki Desk | 7 Dec 2024 2:30 PM GMTఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టార్లలో `బడే మియాన్ చోటే మియాన్` ఒకటి. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వాషు భగ్నానీ నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో దర్శకనిర్మాతల మధ్య గొడవలు బయటపడ్డాయి. ఆ ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారనేది ఆరోపణ. ప్రస్తుతం వారిపై కోర్టు కేసు నడుస్తోంది.
తాజా సమాచారం మేరకు... నిర్మాత వాషు భగ్నానీని మోసం చేయడం, ఫోర్జరీ చేయడం వంటి ఆరోపణలపై దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, సహ నిర్మాత హిమాన్షు మెహ్రా తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిసెంబర్ 2న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బాంద్రా కోర్టు బాంద్రా పోలీసులను ఆదేశించింది. 2024 మల్టీస్టారర్ చిత్రం బడే మియాన్ చోటే మియాన్ నిర్మాత భగ్నాని చేసిన ఆరోపణలకు సంబంధించినది ఈ కేసు విచారణలో కోర్టు పైవిధంగా పేర్కొంది. సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 420 (మోసం), 465 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ), 471 (ఉపయోగించి) ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. నకిలీ పత్రం నిజమైనదిగా చూపిన కారణంగాను... ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 500 (పరువు నష్టం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
3 సెప్టెంబరు 2024న అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా తదితరులపై మోసం, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసంతో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారని వాషు భగ్నానీ బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బడే మియాన్ చోటే మియాన్ నిర్మాణ సమయంలో అతడి సంతకాలను దర్శకుడు ఇతరులు ఫోర్జరీ చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తదనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భగ్నానీ బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం ప్రకారం.. భగ్నానీ ఫిబ్రవరి 2021లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో యాక్షన్-కామెడీ బడే మియాన్ చోటే మియాన్ సహా నాలుగు చిత్రాలకు ఒప్పందం చేసుకున్నారు. నవంబర్ 2021లో భగ్నాని అలీ అబ్బాస్ జాఫర్‌ని ఈ చిత్రానికి దర్శకరచయితగా తీసుకోవాలని కోరాడు. తనను మోసం చేయడానికి ముందస్తు ప్రణాళికతో జాఫర్ ఈ ఆఫర్‌ను అంగీకరించాడని, అయితే హిమాన్షు మెహ్రాను సహ నిర్మాతగా నియమించాలని ... ఖాతాలు, ఆడిట్‌లు సంబంధిత పనిని నిర్వహించడానికి ఇతర అసోసియేట్‌లతో పాటు ఏకేష్ అనే వ్యక్తిని నియమించాలని షరతు విధించాడని భగ్నాని ఆరోపించారు. తప్పుడు ప్రాతినిధ్యాల ఆధారంగా జాఫర్ ఈ నియామకాలు చేశారని ఆరోపించారు.
స్టార్ హీరోల పారితోషికాన్ని మినహాయించి, భగ్నాని భరించే విధంగా సినిమా కనీస నిర్మాణ వ్యయం రూ.125 కోట్లుగా నిర్ణయించారు. ప్రారంభ ఒప్పందాలు ఉన్నా కానీ సినిమా నిర్మాణం.. పంపిణీ దశల్లో జాఫర్ అతని సహచరులు తనను మోసం చేశారని భగ్నాని ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 2022లో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే జాఫర్ అధిక పారితోషికం డిమాండ్ చేశాడని, అయితే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘిస్తూ జూలై 2022లో మాత్రమే సినిమా స్క్రిప్ట్‌ను అందించాడని భగ్నానీ ఆరోపించారు. మరో విషయం ఏమిటంటే.. ఈ సినిమాలోని కొంత భాగాన్ని యుఎఇలో చిత్రీకరించారు. అక్కడ జాఫర్ అతడి సహచరులు ఖరీదైన హోటళ్లలో బస చేశారని, భగ్నాని చేసిన ముందస్తు ఏర్పాట్లను విస్మరించి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారీ ఖర్చులు చేశారని ఆరోపించారు. ప్రారంభ బడ్జెట్ రూ. 125 కోట్లు... ఖర్చులను నియంత్రించడానికి జాఫర్ అతడి బృందం నిరాకరించిన కారణంగా ఉత్పత్తి ఖర్చులు రూ.154 కోట్లకు పెరిగాయి.. అని భగ్నానీ ఆరోపించారు.