ఫస్ట్ డే కలెక్షన్స్.. స్ట్రాటజీ మారిందా?
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 1 Dec 2024 3:30 PM GMTపాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడిని వీలైనంత వేగంగా రికవరీ చేయాలంటే కలెక్షన్స్ మొదటి రోజు నుంచే భారీగా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు వర్క్ అవుట్ అవుతున్నాయి. అందుకే చాలా వరకు పాన్ ఇండియా ఇమేజ్ తో వచ్చే స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేస్తున్నాయి.
ఎక్కువ భాషలలో సినిమాని రిలీజ్ చేయడంతో పాటు స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తున్నారు. తొందరగా ప్రేక్షకులకి కూడా కంటెంట్ ని బలంగా రీచ్ అయ్యేలా చేస్తున్నారు. అందుకే మొదటి రోజే చాలా మంది సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి టికెట్ ధరలు కూడా గణనీయంగా పెంచుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇస్తున్నాయి.
ఈ టికెట్ ధరల పెంపు కారణంగా మొదటి రోజు భారీ వసూళ్లు అందుకోలుగుతున్నారు. ఇండియాలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా 223 కోట్లతో ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. 217 కోట్ల కలెక్షన్స్ తో ‘బాహుబలి 2’ రెండో స్థానంలో ఉంది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ 190 కోట్లు మొదటి రోజు వసూళ్లు చేసింది. ‘దేవర’ మూవీ కూడా 150+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.
అయితే ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని అందుకోవడానికి మేకర్స్ మరో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. స్పెషల్ ప్రీమియర్స్ షోలు వేస్తూ వాటి టికెట్ ధరలు భారీగా పెడుతున్నారు. అలాగే బెన్ ఫిట్ షోలు కూడా వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లలో వేస్తున్నారు. రిలీజ్ కి ముందు రోజు రాత్రికి ప్రీమియర్స్ వేస్తున్నారు. అలాగే మిడ్ నైట్ బెన్ ఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నారు. ఇవి కాకుండా అదనంగా ప్రతి రోజు ఐదు షోలు పడుతున్నాయి.
ఈ ఎక్స్ ట్రా షోలతో వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ఫస్ట్ డే కలెక్షన్స్ లో చూపిస్తున్నారు. ఈ పద్దతిలోనే ‘పుష్ప 2’ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ పై కన్నేసింది. టికెట్ ధరలు కూడా భారీగా పెంచడంతో 200+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని మొదటి రోజు ఈ సినిమా వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారు. ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులలో ఏదో ఒకటి బ్రేక్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో మొదటి రోజు తెలుగు స్టార్ హీరోల సినిమాలకి 300+ కోట్లు కలెక్షన్స్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.