ఫస్ట్ డే సెంచరీ కొట్టే సెకెండ్ లిస్ట్ ఇదేనా!
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదు. ఒకవేళ అలా ఉంటే అది సినిమాకి అదనపు అస్సెట్. ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
By: Tupaki Desk | 29 Dec 2023 12:30 PM GMTకంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదు. ఒకవేళ అలా ఉంటే అది సినిమాకి అదనపు అస్సెట్. ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి తొలిరోజు వసూళ్లతో సెంచరీ కొట్టిన నయా
సౌత్ దర్శకులు ఎంతమంది ఉన్నారు? అంటే గుర్తొచ్చేది వీళ్లే. `బాహుబలి-2`...`ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలతో దర్శకధీరుడు మొదటి రోజే సెంచరీ కొట్టేసారు. వందకోట్ల వసూళ్ల ఓపెనింగ్ వావ్ అనిపిం చారు. ఇదే వరుసలో ప్రశాంత్ నీల్..అట్లీ...లోకేష్ కనగరాజ్..సందీప్ రెడ్డి..సుజిత్ లాంటి దర్శకులు చేరారు.
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ -2 తో మొదటి రోజుల 134 కోట్లు.. తర్వాత తన రికార్డును తానే సలార్ తో బ్రేక్ చేసాడు. ఈ సినిమా ఏకంగా తొలిరోజు 170 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక లియో తో లొకేష్ కనగరాజు మొదటి రోజు 145 కోట్లు రాబట్టాడు. ఇక ఇదే వరుసలో సందీప్ ...అట్లీ లాంటి దర్శకులు లిస్ట్ లో ఉన్నారు. వీళ్లంతా వంద కోట్లు రాబట్టి మొదటి లిస్ట్ అయితే...రెండవ లిస్ట్ లో మరి కొంత మంది దర్శకులు తొలి రోజు సెంచరీ క్లబ్ లో చేరాలని ఎదురు చూస్తున్నారు.
వారే సుకుమార్..కొరటాల శివ... నాగ్ అశ్విన్...రిషబ్ శెట్టి! వీళ్లంతా ఇప్పుడు తెరకెక్కిస్తోన్న చిత్రాలే ఆ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ బన్నీతో `పుష్ప-2` పాన్ ఇండియాలో భారీ ఎత్తున తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండానే సంచల నాలు నమోదు చేసింది. దీంతో `పుష్ప-2` తొలి రోజు 100 కోట్లకు మించి వసూళ్లు సాధింస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
ఇక కొరటాల శివ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `దేవర`పై అంచనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. `ఆర్ ఆర్ ఆర్` తో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయ్యాడు. దీంతో 'దేవర' తొలి రోజు ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ తెస్తుందా? అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలైపోయాయి. ఇక నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో తెరకెక్కిస్తోన్న కల్కీ గురించి చెప్పాలా? ఇండియాని షేక్ చేసే మరో సినిమా అవుతుం ది అన్న అంచనాలున్నాయి. తొలి రోజు 200 కోట్లు తెచ్చే సినిమా అవుతుందన్న అంచనాలున్నాయి. ఇక `కాంతార`తో తనని తానే పాన్ ఇండియా స్టార్ గా లాంచ్ చేసుకున్న రిషబ్ శెట్టి `కాంతార-2` తో 100 కోట్ల క్లబ్ లోనే చేరతాడు అన్న అంచనాలున్నాయి.