Begin typing your search above and press return to search.

బహుముఖం.. మంచి చెడులో ఒక యాక్టర్

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో హర్షివ్ కార్తీక్ అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన సైకలాజికల్ థ్రిల్లర్ బహుముఖం మూవీలో నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 10:11 AM GMT
బహుముఖం.. మంచి చెడులో ఒక యాక్టర్
X

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చిత్రనిర్మాతలు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. విలక్షణమైన రీతిలో తీస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. రొటీన్ కాన్సెప్ట్ లతో రూపొందిన సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాలను ఆదరిస్తున్నారు. కంటెంట్ నచ్చితే బ్రహ్మరథం పడుతున్నారు.


ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో హర్షివ్ కార్తీక్ అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన సైకలాజికల్ థ్రిల్లర్ బహుముఖం మూవీలో నటిస్తున్నారు. గుడ్, బ్యాడ్ అండ్ యాక్టర్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో స్వర్ణిమా సింగ్, మార్టినోవా కథానాయికలుగా యాక్ట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్.. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

పోస్టర్‌ లో హర్షివ్ కార్తీక్ మల్టీ డైమెన్షనల్ అవతార్‌ లో కనిపించారు. ఓ వైపు సంతోషం, ఇంకోవైపు దుఃఖం ఎమోషన్లను పండించారు. ఫేస్ లో ఒక వైపు నుదుటిపై విభూతితో నీలం రంగు పెయింట్ తో ఉండగా, ఇంకో వైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారు. చేతులకు సంకెళ్లు ఉన్నాయి. మొత్తానికి ఈ పోస్టర్ తో సినిమాపై ఆసక్తి పెరుగుతోందని నెటిజన్లు చెబుతున్నారు.

స్టోరీ లైన్.

హీరో అవ్వాలని కలలు కనే తన్వీర్ (హీరో) తన జైలు జీవితాన్ని గడిపి సిటీలోకి వస్తాడు. అక్కడ కౌన్సిలింగ్ కు వెళుతున్న సమయంలో అతడికి దిశా అనే సైకాట్రిస్ట్ తో పరిచయం ఏర్పడుతుంది. దిశ సహాయంతో కోలుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయాలనుకుంటాడు తన్వీర్. అయితే అతడి వద్ద ఉన్న రహస్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. చివరకు ఏం అవుతుంది? అతడు హీరో అవుతాడా? అనేదే మిగతా స్టోరీ.

ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్.. అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, అమెరికా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ప్రధాన పాత్రలో నటించిన హర్షివ్ కార్తీక్.. ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, కో-ఎడిటర్ గా కూడా వ్యవహరించారు. క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రూపొందిన ఈ చిత్రానికి అరవింద్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రాఫర్ కాగా, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.