Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ఫేర్ 2024: బేబీ లిస్టులో ఐదు

ఇక సినిమా ఏదో ఒక సందర్భంలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   4 Aug 2024 8:25 AM GMT
ఫిల్మ్ ఫేర్ 2024: బేబీ లిస్టులో ఐదు
X

టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన "బేబీ" సినిమా, 69వ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డుల వేడుకలో మరో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో లాభాలు అందించిన చిన్న సినిమాల్లో బేబీ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సినిమా ఏదో ఒక సందర్భంలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.


సాయి రాజేష్ దర్శకత్వంలో, SKN నిర్మాతగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం, 8 నామినేషన్లలో 5 అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యల నటన ప్రేక్షకుల మనసును కదిలించింది. సినిమాకు వర్క్ చేసిన ప్రతీ ఒక్కరికీ కూడా మంచి గుర్తింపు దక్కింది.


ముఖ్యంగా వైష్ణవి చైతన్య తన అద్భుతమైన నటనతో ఉత్తమ నటి (బెస్ట్ యాక్ట్రెస్) అవార్డును అందుకుంది. బేబీ సినిమా, 100 కోట్ల గ్రాస్‌ను సాధించి కమర్షియల్‌గా విజయం సాధించినందుకు ఉత్తమ చిత్రంగా (బెస్ట్ ఫిల్మ్) ఎంపికైంది. అలాగే, ఈ చిత్రానికి సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్, “ఓ రెండు మేఘాలిలా” పాటతో ఉత్తమ సంగీత దర్శకుడిగా (బెస్ట్ మ్యూజిక్ కంపోజర్) అవార్డును గెలుచుకున్నారు.


ఈ పాటకు సాహిత్యం రాసిన అనంత్ శ్రీరామ్ ఉత్తమ గేయరచయిత (బెస్ట్ లిరిసిస్ట్) అవార్డును సొంతం చేసుకోగా, సింగర్ శ్రీరామ్ చంద్ర ఈ పాటను హృదయాన్ని హత్తుకునేలా ఆలపించి ఉత్తమ గాయకుడిగా (బెస్ట్ సింగర్) అవార్డును అందుకున్నారు. ఈ అవార్డులు "బేబీ" చిత్రంలోని ప్రతిభను, వినూత్నతను, మరియు ప్రాచుర్యాన్ని చాటిచెప్పాయి. దర్శకుడు సాయి రాజేష్ తన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రశంసలు పొందారు.


ఈ అవార్డుల నేపథ్యంలో "బేబీ" చిత్రంపై బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సక్సెస్‌ఫుల్ సినిమా హిందీ రీమేక్ హక్కులు ఇప్పటికే కొందరు నిర్మాణ సంస్థలు తీసుకున్నట్లు సమాచారం. హిందీ రీమేక్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. సంపూర్ణ విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి గాను, బేబీ టీమ్‌కు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఈ చిత్రం మరో గర్వకారణంగా నిలిచింది.