Begin typing your search above and press return to search.

ఆగష్టు 15… ఏకంగా 5 సినిమాలు

ఆగష్టు నెలలో టాలీవుడ్ సినిమాల సందడి గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   20 July 2024 5:11 AM GMT
ఆగష్టు 15… ఏకంగా 5 సినిమాలు
X

ఆగష్టు నెలలో టాలీవుడ్ సినిమాల సందడి గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే నాలుగు వారాలలో చూసుకుంటే ఆగష్టు థర్డ్ వీక్ లో ఇండిపెండెన్స్ డే వీకెండ్ ని ఉపయోగించుకోవాలని మేగ్జిమమ్స్ మేకర్స్ అనుకుంటున్నారు. అందుకే ఆగష్టు 15న ఎక్కువ మంది తమ సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సిద్ధం అయ్యారు. యంగ్ హీరోలతో పాటు టైర్ 2 జాబితాలో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ చిత్రం హిందీ మూవీ రైడ్ కి రీమేక్ గా తెరకెక్కింది. కచ్చితంగా ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ వస్తుందని రవితేజ భావిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాపై అటు రామ్, ఇటు పూరి జగన్నాథ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తుండటంతో డబుల్ ఇస్మార్ట్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. నివేదా థామస్ లీడ్ రోల్ లో నటించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా 35 ఆగష్టు 15న రిలీజ్ అవుతోంది. ప్రెజెంట్ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే స్టోరీలైన్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

దగ్గుబాటి రానా నిర్మించారు. నార్నె నితిన్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంట్రటైనేర్ అయ్ మూవీ ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ కథాంశంతో ఈ మూవీ సిద్ధమైంది. అంజిబాబు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీ వాస్ ఈ మూవీని నిర్మించారు. వీటితో పాటు చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ తంగలాన్ ఆగష్టు 15న రిలీజ్ అవుతోంది.

పీరియాడిక్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. చాలా సార్లు వాయిదా పడి ఫైనల్ గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. ఈ ఐదు సినిమాలు వేటికవే డిఫరెంట్ కథాంశాలతో తెరకెక్కినవి కావడం విశేషం. అలాగే ఈ కథలన్నింటికి కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి వీటిలో ఏది ఇండిపెండెంట్స్ డే విన్నర్ అవుతుందనేది చూడాలి.