పాతికేళ్లుగా ఫ్లాపులే.. ఇన్ని సినిమాలు చేయడమెలా?
ఒక పెద్ద నిర్మాణ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారమైంది. దాదాపు రెండు దశాబ్ధాలు పైగా ఈ బ్యానర్ నుంచి సరైన హిట్టు లేదు.
By: Tupaki Desk | 14 Feb 2025 7:14 AM GMTఒక పెద్ద నిర్మాణ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారమైంది. దాదాపు రెండు దశాబ్ధాలు పైగా ఈ బ్యానర్ నుంచి సరైన హిట్టు లేదు. వరసగా భారీ ఫ్లాపులు బ్యానర్ ప్రతిష్ఠను దెబ్బ తీసాయి. సదరు సంస్థ అప్పుల పాలై తీవ్ర ఇబ్బందుల్లో ఉందని కథనాలొచ్చాయి. ఏడాదికో ఫ్లాప్ చొప్పున విడుదల చేసిన ఈ బ్యానర్ తిరిగి కోలుకోవాలంటే క్రేజ్ ఉన్న హీరోలు, పెద్ద డైరెక్టర్లతో పని చేయాలి. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు. అంతగా లక్ కలిసి రాని నిర్మాణ సంస్థతో ఒప్పందాల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు.
గత ఏడాది ఇండస్ట్రీ బెస్ట్ యాక్షన్ హీరోలతో తీసిన భారీ చిత్రం సైతం జీరో వసూళ్లతో డిజాస్టరైంది. ఈ ఫలితం ఆ బ్యానర్ ని మరింతగా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. అయితే ఎన్ని ఫ్లాపులొచ్చినా ఈ బ్యానర్ వరుసగా సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులున్నా, ప్రతిష్ఠ దిగజారినా సినిమాలు చేస్తూనే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.
ఇప్పుడు అదే బ్యానర్ నుంచి ఆల్మోస్ట్ డిజాస్టర్ కెరీర్ ని కొనసాగిస్తున్న ఒక యువ బాలీవుడ్ హీరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నారీ నారీ నడుమ నలిగిపోయే కుర్రాడిగా అతడు నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్, భూమి ఫెడ్నేకర్ లాంటి అందాల భామలు నటించినా ఈ సినిమాకి సరైన బజ్ లేదు. దీంతో ఇది కూడా మరో ఫ్లాప్ అంటూ ముందే ప్రచారమైపోతోంది. మరో వారంలో విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందా లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. అంతగా క్రేజ్ లేని హీరో, ఫ్లాపుల్లో ఉన్న బ్యానర్, ఫేడవుట్ హీరోయిన్లతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఒకెత్తు అనుకుంటే, అసలు ఇన్ని ఫ్లాపులొచ్చినా కానీ వరుసగా సినిమాలు చేసేంత శక్తి, ద్రవ్యం (డబ్బు) ఎక్కడి నుంచి వస్తోంది? అన్నది చర్చగా మారింది.