Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. డిసెంబర్ లెక్క మారుతుందా లేదా..?

ఇదిలా ఉంటే ఈ ఏడాది డిసెంబర్ లో టాలీవుడ్ నుంచి ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Sep 2024 4:04 AM GMT
బాక్సాఫీస్.. డిసెంబర్ లెక్క మారుతుందా లేదా..?
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కుతున్న ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అనే మాట వినిపిస్తోంది. టైర్ 2, టైర్ 1లో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాంటి కథలు అయితే వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. ఆ మూవీస్ థియేటర్స్ లో అన్ని భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయితే భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ.

ఒకవేళ ధియేటర్స్ లో తెలుగు వెర్షన్ మాత్రమే వర్క్ అవుట్ అయ్యి మిగిలిన భాషలలో ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయిన ఓటీటీ రైట్స్ ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ఈ రెండు విషయాలని దృష్టిలో ఉంచుకొని తెలుగు స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సినిమాలు వర్క్ అవుట్ అవుతున్నాయి. ముఖ్యంగా టైర్ 1లో ఉన్న మన తెలుగు స్టార్ హీరోల సినిమాలు దేశవ్యాప్తంగా క్లిక్ అవుతున్నాయి.

బలమైన కథాంశాలతో తెరకెక్కే సినిమాలకు నార్త్ ఇండియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది డిసెంబర్ లో టాలీవుడ్ నుంచి ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వాటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' కూడా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. 'పుష్ప 2' చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ చిత్రం 1000 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరుతుందని మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అది సాధ్యం కాకపోయిన ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, కింగ్ నాగార్జున హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ 'కుభేర' రిలీజ్ కానుంది. డిసెంబర్ 13 లేదా 20న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని నాగచైతన్య హీరోగా గీత ఆర్ట్స్2 లో సిద్ధమవుతున్న పాన్ ఇండియా మూవీ 'తండేల్' డిసెంబర్ 20న రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఆల్ మోస్ట్ అదే డేట్ కి రావడం ఖాయం అని మేకర్స్ అంటున్నారు. ఒక వేళ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అయితే జనవరి 13న సంక్రాంతికి 'తండేల్' రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు అయితే డిసెంబర్ లో 'గేమ్ చేంజర్' రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు. మరి శంకర్ ఆ సమయానికి అవుట్ ఫుట్ రెడీ చేస్తాడా అనేది వేచి చూడాలి.