Begin typing your search above and press return to search.

అక్క‌డ‌న్నీ బౌండ‌రీలే బాదుతున్నారే!

బాలీవుడ్ లో హిట్ సినిమాకి సీక్వెల్స్ అన్న‌ది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ‌. ఈ సీక్వెల్ ట్రెండ్ అన్న‌ది అక్క‌డ ఎంతో కాలంగా కొన‌సాగుతుంది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 1:30 PM GMT
అక్క‌డ‌న్నీ బౌండ‌రీలే బాదుతున్నారే!
X

బాలీవుడ్ లో హిట్ సినిమాకి సీక్వెల్స్ అన్న‌ది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ‌. ఈ సీక్వెల్ ట్రెండ్ అన్న‌ది అక్క‌డ ఎంతో కాలంగా కొన‌సాగుతుంది. అలా సీక్వెల్స్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డం అన్న‌ది అక్క‌డ పరిపాటే. ఆ సీక్వెల్స్ ట్రెండ్ బాలీవుడ్ ప‌రిశ్ర‌మ నుంచే ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు వెళ్లింది. ఇప్పుడీ ప్రోస‌స్ లో సినిమాలు చేసి అంత‌కు మించి అద్భుతాలు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు న‌మోదు చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నుంచి ఒకే నెంబ‌ర్ తో నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లే. భారీ అంచ‌నాలున్న చిత్రాలే. ఆ వివ‌రాల్లోకి వెళ్తే...` బాఘీ-4` ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. టైగ‌ర్ ష్రాఫ్ , జిమ్మీ షేర్ గిల్, సంజ‌య్ ద‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో హ‌ర్ష ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ప్రేక్ష‌కుల్ని న‌వ్వుల్లో ముంచెత్తిన చిత్రం `మ‌స్తీ`. వివేక్ ఓబెరాయ్ , రితేష్ దేశ్ ముఖ్ , అప్తాబ్ శివాదా సానీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఇప్ప‌టికే మూడు భాగాలుగా విడుదలై మంచి విజ‌యం సాధించింది.

ఇప్పుడీ ప్రాంచైజీ నుంచి `మ‌స్తీ -4` వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీన్ని మిలాప్ జావేరీ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది. రెండింత‌ల న‌వ్వుతో మ‌స్తుగా న‌వ్విస్తామంటూ వ‌స్తున్నారు. మునుప‌టి భాగాల కంటే రెట్టింపు వినోదం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక యాక్ష‌న్ ప్రాంచైజీ `ధూమ్` గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మూడు భాగాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. దీంతో `ధూమ్-4`కి రంగం సిద్ద‌మ‌వుతుంది.

ఇందులో హీరో, ఇత‌ర వివ‌రాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే ఎంతో కాలంగా ఊరిస్తోన్న `క్రిష్‌-4` కూడా 2025లో లాంచ్ అవుతుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో య‌ధావిధిగా హృతిక్ రోష‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమా డైర‌క్ట‌ర్ విష‌యంలోనూ క్లారిటీ రావాలి. ఇంకా ప్ర‌స్తుతం మ‌రిన్ని సిరీస్ లు ఆన్ సెట్స్ ల ఉన్నాయి.