Begin typing your search above and press return to search.

దేశం మీసం తిప్పేలా బ‌రిలోకి!

స్వ‌తంత్ర సంగ్రామంలో వీరుల జీవితాల‌కు చిత్ర ప‌రిశ్ర‌మ తొలి నుంచి బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Aug 2023 6:37 AM GMT
దేశం మీసం తిప్పేలా బ‌రిలోకి!
X

స్వ‌తంత్ర సంగ్రామంలో వీరుల జీవితాల‌కు చిత్ర ప‌రిశ్ర‌మ తొలి నుంచి బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు దేశ భ‌క్తి నేప‌థ్యంగ‌ల చిత్రాలు భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఆ త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కుల‌కు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డ‌తారు. తాజాగా 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఈ ఏడాది ప‌లు దేశ భ‌క్తి నేప‌థ్యంగ‌ల చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ప్ర‌స్తుతం కొన్ని సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఆ సంగ‌త‌లు ఓసారి చూస్తే..

వైమానిక ద‌ళ వీరుల క‌థ‌తో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ 'ఆపరేష‌న్ వ‌లెంటైన్' అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో వ‌రుణ్ తేజ్ ఎయిర్ పోర్స్ పైలెట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వైమానిక ద‌ళంలో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. అన్ని ప‌నులు పూర్తిచేసి డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

అలాగే షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ 'జ‌వాన్' టైటిల్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దేశంలో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో అట్లీ మార్క్ సందేశం ఉంటుంద‌ని అంచ‌నాలున్నాయి. సెప్టెంబ‌ర్ 7న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ద‌ర్శ‌కుడు క‌న్న‌య్య అయ్య‌ర్ తెర‌కెక్కిస్తోన్ మ‌రో దేశ‌భ‌క్తి చిత్రం 'ఏ వ‌త‌న్ మేరా వ‌త‌న్'.

స్వాతంత్రం ఉద్య‌మ స‌మ‌యంలో క్విట్ ఇండియా ఉద్య‌మానికి ప్ర‌భావితురాలైన ఒక యువ‌తి త‌న జీవితాన్ని ఎలా అంకితం చేసిందో చూపించ‌బోతున్నారు. ఆ పాత్ర‌లో సారా అలీఖాన్ న‌టిస్తోంది. సెప్టెంర్ 30 న సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే సిద్దార్ద్ మ‌ల్హోత్రా.. రాశీఖ‌న్నా..దిశా ప‌టానీ న‌టిస్తోన్న 'యోధ' కూడా దేశ భ‌క్తి నిండిన సినిమానే. ఒక సైనికుడు తీవ్ర‌వాదుల ఆట‌క‌ట్టించ‌డానికి చేసిన సీక్రెట్ ఆప‌రేష‌న్ ఇది. ఆంబ్రే..పుష్క‌ర్ ఓఝాలు చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇక యంగ్ హీరో ఇషాన్ క‌ట్ట‌ర్ ' పిప్పా' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. 1971 లో భార‌త్ -పాకిస్తాన్ యుద్దంలో వీరోచితంగా పోరాడిన బ్రిగేడియ‌ర్ బ‌ల‌రామ్ సింగ్ మెహ‌తా స్వాను భ‌వాల స‌మూహ‌ర‌మే ఈ సినిమా. రాజా కృష్ణ‌మీన‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. డిసెంబ‌ర్ 2న చిత్రం విడుద‌ల‌వుతుంది. అలాగే 1971 లో పాక్ తో జ‌రిగిన యుద్దంలో ముందుండి గెలిపించిన వ్యూహ క‌ర్త ..త్రివిధ ద‌ళాల అధిప‌తి శ్యామ్ బ‌హ‌దూర్ మానెక్ షా . ఆయ‌న జీవితం ఆధారంగానే మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా 'శ్యామ్ బ‌హ‌దూర్'. టైటిల్ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్ పోషిస్తున్నాడు. 'ఉరి' త‌ర్వాత విక్కీ దేశ భ‌క్తి నేప‌థ్యం గ‌ల సినిమాల‌కు బ్రాండ్ గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే.