Begin typing your search above and press return to search.

పార్టీ బోయ్ ఒర్రీపై FIR .. షాకింగ్ రీజన్!

అత‌డు గాళ్స్ తో పార్టీ చేసుకున్నందుకు డ‌బ్బు సంపాదించ‌గ‌ల‌డు! అలాంటి ఫేమ‌స్ సెల‌బ్రిటీ ఇప్పుడు అడ్డంగా బుక్క‌య్యాడు.

By:  Tupaki Desk   |   17 March 2025 5:36 PM IST
పార్టీ బోయ్ ఒర్రీపై FIR .. షాకింగ్ రీజన్!
X

ఓర్రీ అకా ఓర్హాన్ అవత్రమణి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలీవుడ్ సెల‌బ్రిటీ పార్టీల్లో అత‌డు లేనిదే ఈవెంట్‌కి క‌ళ‌ లేన‌ట్టే. గాళ్స్ గ్యాంగ్ తో క‌లిసి ర‌చ్చ చేస్తూ పార్టీకి ప్ర‌త్యేక క‌ళ తెస్తాడు. అత‌డు గాళ్స్ తో పార్టీ చేసుకున్నందుకు డ‌బ్బు సంపాదించ‌గ‌ల‌డు! అలాంటి ఫేమ‌స్ సెల‌బ్రిటీ ఇప్పుడు అడ్డంగా బుక్క‌య్యాడు.

ఒర్రీ స‌హా మరో ఏడుగురిపై జ‌మ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైష్ణో దేవి మందిరం సమీపంలో కాట్రాలోని నిషేధిత ప్రాంతంలో మద్యం సేవించినందుకు వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తా సంస్థ ఎన్.ఐ.ఏ పేర్కొంది. పోలీసుల క‌థ‌నం ప్రకారం.. కాట్రాలోని ఒక హోటల్‌లో మద్యం సేవించ‌డం చ‌ట్ట ప్ర‌కారం నేరం. ఓర్రీతో పాటు, మరో నిందితురాలు రష్యన్ జాతీయురాలు అనస్తాసిలా అర్జామస్కినా.. అత‌డి స్నేహితులు పార్టీ చేసుకున్నారు. ఓర్రీ, దర్శన్ సింగ్, పార్థ్ రైనా, రితిక్ సింగ్, రాశి దత్తా, రక్షిత భోగల్, షాగున్ కోహ్లీ, ర‌ష్య‌న్ గాళ్ అర్జామస్కినాలను ప్రాథమిక నిందితులుగా పేర్కొంటూ కాట్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (నం. 72/25) నమోదు అయింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు వారిపై అభియోగాలు మోపారు.

హిందూ మతంలోని పవిత్ర తీర్థయాత్రల‌లో ఒకటైన ప్ర‌ఖ్యాత‌ వైష్ణో దేవి మందిరానికి సమీపంలో కాట్రా ఉంది కాబట్టి, మాంసాహారం - మత్తు పదార్థాలపై కఠినమైన నియమాలు అమ‌ల్లో ఉన్నాయి. కానీ ఒర్రీ అత‌డి బృందం దీనిని ప‌ట్టించుకోకుండా త‌ప్పు చేసార‌ని అధికారులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎస్పీ, డిప్యూటీ ఎస్పీ స‌హా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశార‌ని వెల్ల‌డించారు. మతపరమైన ప్రదేశాలలో మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగం వంటి కార్యకలాపాలలో పాల్గొనడం చట్టాన్ని ఉల్లంఘించడంగా భావించి, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రియాసి ఎస్ఎస్పి తెలిపారు.