Begin typing your search above and press return to search.

న‌క్క‌లు ఊల‌లు వేసి.. తోడేళ్లు వెంట‌ప‌డే చోట న‌టి క్ష‌ణ‌క్ష‌ణం

అక్క‌డ ప్ర‌తి ఒక్క‌రూ అవ‌కాశాల కోసం పోరాడ‌టం చూసి భ‌యంక‌రంగా అనిపించేదిట‌.

By:  Tupaki Desk   |   20 March 2025 9:34 AM IST
న‌క్క‌లు ఊల‌లు వేసి.. తోడేళ్లు వెంట‌ప‌డే చోట న‌టి క్ష‌ణ‌క్ష‌ణం
X

చిన్న వయసులోనే సొంత ఊరు సొంత మ‌నుషుల‌ను వ‌దిలేసి ముంబైలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ సినీప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరిగింది. కానీ రంగుల ప్ర‌పంచం ఒక‌ అస్థిర‌మైన రంగం. నిర్మాణాత్మ‌క‌మైన మార్గం ఏదీ లేనిది. అక్క‌డ ప్ర‌తి ఒక్క‌రూ అవ‌కాశాల కోసం పోరాడ‌టం చూసి భ‌యంక‌రంగా అనిపించేదిట‌. అస‌లే ఆడ‌పిల్ల‌. పైగా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ. ఇక త‌న క‌ష్టాలు చెప్పుకునేదేం ఉంది! న‌క్క‌లు ఊల‌లు వేస్తాయి.. తోడేళ్లు వెంట‌ప‌డ‌తాయి!!


ఆడిషన్లు ఇస్తూనే ఉన్నాను.. కానీ నేను చనిపోతాను.. లేదా జనంలో అదృశ్యమవుతానని.. ఎప్పటికీ గుర్తింపు ద‌క్క‌ద‌ని భ‌య‌ప‌డ్డాను. 99 శాతం నాకు చేత‌కాద‌ని అనుకున్నాను. నేను ఏం చేస్తున్నానో... ఎక్కడ చేస్తున్నానో తెలీదు.. పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల‌నుకునే వ్యవస్థ కూడా ఇక్క‌డ లేదు! అయితే పోరాటంలోనే ప‌రిణ‌తి చెందాను.

ఇంటికి తిరిగి వెళ్లాలని ఎప్పుడూ అనిపించలేదు. నేను ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ముంబైలో ప్ర‌తి ఆఫీస్ కి ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ క‌ఠినంగా తిరిగాను... మోడలింగ్ చేసాను.. బ‌త‌కడానికి ఇంకేదైనా చేయడానికి ప్రయత్నించాను... ఆ సమయం చాలా కఠినంగా ఉంది. జీవితంలో నన్ను నేను ఏదైనా చేసుకుంటానేమో నాకు తెలియదు.. పోరాడాను! నా వ‌య‌సును మించి ప‌రిణ‌తి చెంద‌డానికి నాకు ఈ ప‌రిస్థితులు స‌హ‌క‌రించాయి. ఆ సమయంలో నేను చాలా పుస్తకాలు, తత్వాలు, విచారకరమైన కవిత్వాన్ని చదవడం ప్రారంభించాను. నేను ఉన్న పరిస్థితుల దృష్ట్యా, నేను ఈ జీవితంలో విజయం సాధించలేనని న‌మ్మాను.

అయితే ఇన్ని క‌ష్టాల త‌ర్వాత ఈ న‌టికి గొప్ప గుర్తింపు ద‌క్కింది. ఇండ‌స్ట్రీలో ఎవ‌రినైనా ఎదురించ‌గ‌లిగేంత ద‌మ్ముంది. పెద్ద ద‌ర్శ‌కులు, అగ్ర హీరోల‌ను సైతం ఎదురిస్తోంది. నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచే వివాదాస్ప‌ద న‌టిగా మారింది. నోటి దురుసుతో నే సగం హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో అంచెలంచెలుగా అగ్ర నాయిక‌గా ఎదిగింది. త‌న‌ న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డును కూడా అందుకుంది. ఇటీవ‌ల ద‌ర్శ‌క‌త్వం పేరుతో ప్ర‌యోగాలు చేస్తోంది. సినిమాలు ఫ్లాపులైతే ఆస్తులు అమ్ముకుంది. ప‌డుతూ లేస్తోంది. అయినా మొక్క‌వోని ధీక్ష‌తో ముందుకు వెళుతోంది. ఆస‌క్తిక‌రంగా ఈ భామ నోటి మాట‌లో స్పీడ్ చూసి ఏకంగా ఎంపీని చేసింది ఓ పెద్ద‌ పార్టీ. మొత్తానికి త‌న‌కు ఒక బిగ్ బ్రేక్ వచ్చే ముందు ఎన్ని క‌ష్టాల‌ను అనుభ‌వించిందో బ‌హిరంగంగా మ‌రోసారి చెప్పుకొచ్చింది. ఈ న‌టి మ‌రెవ‌రో కాదు కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ కంగ‌న ర‌నౌత్. గ్యాంగ్ స్ట‌ర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన కంగ‌న ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. న‌టిగా ఉత్త‌మ ఫేజ్ కి చేరుకుంది. కంగ‌న‌ జీవితం ఎప్పుడూ ఒక తెరిచి ఉంచిన పుస్త‌కం.