సంక్రాంతి పండుగతో ఏడాదికి సరిపడ రీచార్జ్!
ఆవేంటో ఆమె మాటల్లోనే.. `నాకు చిన్న నాటి నుంచి సంక్రాంతి అంటే చాలా ఇష్టం.
By: Tupaki Desk | 14 Jan 2024 4:30 PM GMTమృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ గురించి పరిచయం అవసరం లేదు. `సీతారమం`తో తెలుగు లోగిళ్లలో సీతమ్మగా అలవాటైపోయింది. మరాఠి నటి అయినా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే `హాయ్ నాన్న` విజయంతోనే ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. తనదైన మార్క్ నటనతో మరోసారి మెప్పించింది. మరి సీతమ్మ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది? భోగి పండుగను ఎలా ఎంజాయ్ చేస్తుంది? అంటే చాలా సంగతులే తెలుస్తున్నాయి.
ఆవేంటో ఆమె మాటల్లోనే.. `నాకు చిన్న నాటి నుంచి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. భోగి రోజు సాయంత్రం మంట వేసి కుటుంబ సభ్యులంతా దాని చుట్టూ తిరుగుతూ బెల్లం.. నువ్వులు. .పల్లీలు ..మరమరాలు అన్నింటిని అగ్నికి సమర్పిస్తాం. మకర సంక్రాంతి రోజున ఇంట్లో పూజ చేస్తాం. అమ్మ బెల్లం.. నువ్వు లు..మరమరాలతో బోలెడు వంటకాలు చేస్తుంది. మా సంప్రదాయ ప్రకారం ఈ పండుగలో నలుపు దుస్తులు ధరిస్తాం.
మూడు రోజుల పాటు బయట ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతోనే గడుపుతాం. ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే ఉత్సాహంతో ఏడాది అంతా పనిచేస్తాం. మాకు ఈ పండుగ ఓ రీచార్జ్ లాంటింది. సినిమాల్లోకి వచ్చాక తెలుగు సంప్రదాయం గురించి తెలిసింది. ఇక్కడ ముగ్గులకు ఇచ్చే ప్రాధాన్యత చూస్తుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ ముగ్గులు ఎంతో అందంగా ఉంటాయి.
ఇలాంటి ముగ్గులు నేను ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. వాకిలి..గుమ్మంలో ఆ ముగ్గులు ఎంతో అందం గా ఉంటున్నాయి. రకరకాల రంగులు.. రకరకాల మోడల్స్ లో ఆ ముగ్గులు ఉంటాయి. ఇది చాలా స్పెషల్ గా అనిపిస్తుంది` అని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన `ఫ్యామిలీ స్టార్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తోన్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.