Begin typing your search above and press return to search.

గామి సెన్సార్.. ఇది అసలు ఊహించనిదే..

డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంటున్న విశ్వక్ సేన్ నెక్స్ట్ గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   5 March 2024 9:54 AM GMT
గామి సెన్సార్.. ఇది అసలు ఊహించనిదే..
X

డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంటున్న విశ్వక్ సేన్ నెక్స్ట్ గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. విద్యాధర్ దర్శకత్వం వహించిన గామి సినిమా మొదట చిన్న సినిమాగా మొదలై ఆ తర్వాత ప్రమోషన్స్ కంటెంట్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ వారం గ్రాండ్ గా ఈ మూవీ థియేట్రికల్ గా రిలీజ్ కాబోతోంది.

తప్పకుండా సినిమాలో కంటెంట్ మాత్రం హై విజువల్స్ తో ఆకట్టుకుంటాయి అని ట్రైలర్ ద్వారానే అర్థమయిపోయింది. ఇక ఈ సినిమాకు విశ్వక్ కూడా బడ్జెట్ కారణాల దృష్ట్యా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. గామి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో హీరో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు.

మానవ స్పర్శ అతనికి ఊహించని విధంగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న అతను హిమాలయాలకు ప్రయాణాన్ని సాగిస్తాడు. అక్కడే అతని సమస్యకు అసలు సమాధానం దొరుకుతుంది అని అనుకుంటాడు. దీంతో అతని ప్రయాణమే గామి సినిమాలో అసలు పాయింట్ అని ట్రైలర్ తో అర్ధమైపోయింది.

ఇక ఈ సినిమాకు తప్పకుండా సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా A సర్టిఫికెట్ రావడం విశేషం. ట్రైలర్ లో అయితే మరి ఆ రేంజ్ లో సీన్స్ అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు సెన్సార్ నుంచి ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే అనే క్లారిటీ రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అంతగా ఈ సినిమాలో పెద్దలు చూసే కంటెంట్ ఏముందా అనే ఆలోచన మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సినిమాలో ఒక తెలియని భావోద్వేగం అలాగే ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఆ విషయాలను ఎంత లోతుగా చెప్పారో వెండితెరపైనే చూడాలి. ఇక ఏ సర్టిఫికెట్ రావడంతో మార్చి 8న కాబోతున్న గామి సినిమాపై మరింత అంచనాల పెరిగాయి. మరి విశ్వక్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో చాందిని చౌదరి ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.