Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ బ్రాండ్ తో బండ్లన్న.. నాగబాబుకే ధీటుగా..

టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్​ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో హాట్​టాపిక్​గా మారుతుంటారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 5:30 PM GMT
పవర్ స్టార్ బ్రాండ్ తో బండ్లన్న.. నాగబాబుకే ధీటుగా..
X

టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్​ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో హాట్​టాపిక్​గా మారుతుంటారు. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారారు. అది కూడా మెగా యూక్టర్​ నాగబాబుతో పోటీకి దిగి వార్తల్లో హాట్​టాపిక్​గా నిలిచారు!

తాజాగా బండ్ల గణేశ్​.. ఓ గుడ్​ న్యూస్​ ట్వీట్ పోస్ట్ చేశారు. కానీ అది కాస్త చర్చనీయాంశమైంది. దాదాపు 10 ఏళ్ల పాటు వరుస పరాజయాలతో ఉన్న టైమ్​లో పవన్​ కల్యాణ్​కు 'గబ్బర్ సింగ్' మూవీ ఎంతటి హిట్​ను అందించిందో తెలిసిన విషయమే. పవన్ కల్యాణ్‌కు మంచి బూస్ట్ ఇవ్వడమే కాకుండా.. ఇండస్ట్రీలో పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఆ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు.

అయితే సెప్టెంబర్​ 2న పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆ రోజు గబ్బర్​ సింగ్ రీరిలీజ్​ చేయనున్నట్లు బండ్ల గణేశ్ ప్రకటిస్తూ పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు సంతోషపడిపోయారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని.. పవర్‌ స్టార్‌ కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచిన 'గుడుంబా శంకర్'ను.. ఆ చిత్ర నిర్మాత, మెగా యాక్టర్​ నాగబాబు కూడా రిలీజ్​ చేయనున్నట్లు అంతకుముందే అనౌన్స్ చేశారు. గుడుంబా శంకర్‌ రీరిలీజ్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారని తెలిపారు.

అయితే బండ్ల ట్వీట్​తో మళ్లీ నాగబాబు.. తన సినిమాను ఆగస్ట్​ 31, సెప్టెంబర్‌ 1న ప్రదర్శించబోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఓ వైపు పవన్ పుట్టినరోజుకు డబుల్ బొనాంజ అంటూ సంబరపడిపోతున్నప్పటికీ.. మరి కొందరూ అది కరెక్ట్ కాదని అంటున్నారు. రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ తగ్గే అవకాశముందని, అయినా నాగబాబుకు పోటీగా బండ్ల గణేశ్ సినిమా రీరిలీజ్​ను అనౌన్స్​ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.

ఆ మధ్యలో చాలా తక్కువ వ్యవధిలో తమ్ముడు, జల్సా సినిమాలను ఒకసారి రీరిలీజ్​ చేశారు. ఆ సమయంలో పెద్ద రికార్డులేమి రాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పుడు గుడుంబా శంకర్​-గబ్బర్​ సింగ్ విషయంలో కూడా ఇలానే జరిగే అవకాశముందని, బండ్లన్న కాస్త ఇది తెలుసుకుని వెనక్కి తగ్గిటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.