Begin typing your search above and press return to search.

బన్నీ విషయంలో అసలేమవుతోంది?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కొద్ది నెలలుగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   21 July 2024 8:02 AM GMT
బన్నీ విషయంలో అసలేమవుతోంది?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కొద్ది నెలలుగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పుష్ప-2 సినిమా పోస్ట్ పోన్ అంటూ చాలా రోజుల పాటు వార్తలు వచ్చాయి. షూటింగ్ చాలా పెండింగ్ ఉండడం వల్ల వాయిదా వేస్తారని టాక్ వచ్చింది. అనుకున్నట్లే ఆగస్టు నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయింది మూవీ. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బన్నీ నంద్యాల వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఒక్క ట్వీట్ చేసి.. నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అదే సమయంలో నాగ బాబు ట్వీట్ చేయడం.. ఆ తర్వాత ట్విట్టర్ ను డీయాక్టివేట్ చేసి యాక్టివేట్ చేయడం.. పవన్ గెలిచాక మెగా సెలబ్రేషన్స్ కు కూడా రాకపోవడం.. ఇవన్నీ తెలిసిందే.

అయితే నిర్మాతలందరితో కలిసి పవన్ వద్దకు అల్లు అరవింద్ వెళ్లినా బన్నీ ఇప్పటి వరకు విష్ చేసినట్లు కనిపించలేదు. రీసెంట్ గా పుష్ప-2 షూటింగ్ ఆగిపోయిందని, సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందని చర్చ సాగింది. పుష్ప సీక్వెల్ షూటింగ్ జరుగుతుండగానే.. బన్నీ ట్రిమ్ చేసుకున్న లుక్ వైరల్ అవ్వగా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత బన్నీ టీమ్ వాటిని కొట్టిపారేయగా.. రీసెంట్ గా బన్నీ వాసు కూడా పుష్ప-2 రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. పవన్ కు వీరాభిమాని అయిన ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్‌ తో సినిమా చేసే ఆఫర్ వచ్చినా.. తాను అంగీకరించనని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిబాబా తెలిపారు. కొన్ని రోజుల క్రితం నాగబాబు పెట్టిన పోస్ట్ అక్షరాలా నిజమన్నారు.

"నాగబాబు గారు చెప్పినట్లు బయటోడైనా.. ఇంటోడైనా.. మనకు అగైనెస్ట్ ఉన్నోడికి సపోర్ట్ చేస్తే బయటోడే.. పుష్ప-2లో నాకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆయన (అల్లు అర్జున్) బిహేవియర్ నచ్చదు. ఒకవేళ ఆఫర్ ఇచ్చినా నేను అల్లు అర్జున్‌ తో పని చేయలేను. డై హార్డ్ అభిమానులు ఉంటారు.. వారిని తన్నడం కొట్టడం చూశాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నన్ను తిట్టినా పర్లేదు. పుష్ప-2 డేట్ ఇంకా ఛేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందే" అంటూ వ్యాఖ్యానించారు.

"మొన్న ఒక ఆరు నెలలు వాయిదా పడింది. మళ్లీ ఆరు నెలలు వాయిదా పడుతుంది. ఆయన(బన్నీ)కు చాలా ఇగో ఉందని అనుకుంటున్నాను. ఇగోను తగ్గించుకుంటే బాగుంటుంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సాయిబాబా. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బన్నీకు సంబంధించిన అన్ని విషయాల్లో జరుగుతున్న ప్రచారం వెనుక ఎవరో కావాలని చేస్తున్నట్లు ఉందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుమానపడుతున్నారు. అవి కేవలం యాంటీ ఫ్యాన్స్ చేసిన పని కాదని, ఇంకెవరో ఉన్నారని ఆరోపిస్తున్నారు. అసలేం జరుగుతుందో తెలియడం లేదని అంటున్నారు. బన్నీని టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో? బన్నీ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.