Begin typing your search above and press return to search.

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మృతి

బరువు తప్పకుండా తగ్గాలి అనుకున్న వారిలో కొందరు ఆపరేషన్‌ చేయించుకున్న వారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   5 Jan 2025 3:32 AM GMT
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మృతి
X

ఈమధ్య కాలంలో తినే తిండి, జీవన శైలి ఇతర కారణాల వల్ల చాలా మందిలో ఊబకాయం వస్తుంది. కొందరు అతిగా తినడం వల్ల లావు అవుతూ ఉంటారు. వారు మనసులో బరువు తగ్గాలని ఎంతగా భావించినా అందుకు తగ్గట్లుగా వర్కౌట్‌లు చేయలేరు. అతి తక్కువ మంది మాత్రమే తమ బరువును కంట్రోల్‌లో పెట్టుకుంటారు, బరువు తగ్గుతారు. బరువు తప్పకుండా తగ్గాలి అనుకున్న వారిలో కొందరు ఆపరేషన్‌ చేయించుకున్న వారు ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన వారిలో కొందరు ఆపరేషన్‌ చేయించుకుని బరువు తగ్గిన వారు ఉన్నారు. కానీ కొందరు మాత్రం కేవలం వర్కౌట్స్‌తో బరువు తగ్గారు.

ఎలాంటి మత్తు పదార్థాలు వాడకుండా కేవలం వర్కౌట్‌లు చేస్తూ, డైట్ ఫాలో కావడం ద్వారా బరువు తగ్గిన వారు కొందరు ఉంటారు. వారిలో గాబ్రియేల్‌ ఫ్రీటాస్ ఒకరు. బ్రెజిల్‌కు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన ఇతడు 2017లో ఏకంగా 174 కేజీల బరువు తగ్గి ప్రపంచానికి చూపించారు. తన బరువు తగ్గిన విధానంను సోషల్‌ మీడియాలో షేర్ చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గాబ్రియేల్‌ గుండె పోటుతో 37 ఏళ్ల వయసులో మృతి చెందాడు.

నిద్రలోనే గాబ్రియేల్‌ మృతి చెందాడని అతడి స్నేహితుడు అధికారికంగా ప్రకటించాడు. అతడు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదు, అతడు చాలా బలంగా ఉన్నాడు. చివరి వరకు అతడి పోరాటం సాగింది. తన మంచి మనసును చాటుకున్న గాబ్రియేల్‌ తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయాడు అంటూ అతడి స్నేహితుడు పేర్కొన్నాడు. డిసెంబర్‌ 30న అతడు మరణించగా కాస్త ఆలస్యంగా విషయాన్ని అతడు తెలియజేశాడు. ప్రపంచ మొత్తం గాబ్రియేల్‌ మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తుంది.

సోషల్‌ మీడియా ద్వారా బరువు తగ్గడానికి డాక్యుమెంట్లు చేస్తూ ఎంతో మందిలో స్ఫూర్తిని నింపిన ఇతడు 29 ఏళ్ల వయసులో బరువు తగ్గడం మొదలు పెట్టడు. 320 కేజీల బరువు ఉన్న ఇతడు ఏడాదిన్నర కాలంలో నేచురల్‌ పద్దతిలో 174 కేజీల బరువు తగ్గడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ఎవరూ సాధ్యం కాదు అనుకున్నది అతడు చేసి చూపించాడు. ఎలాంటి ఆపరేషన్‌లు లేకుండానే అతడు బరువు తగ్గి ప్రపంచానికి కొత్త పద్దతిని చూపించాడు. అలాంటి వ్యక్తి మృతి చెందడం అది 37 ఏళ్ల వయసులో మృతి చెందడం విచారకరం.