సెల్లార్ పార్కింగ్ లో ట్రాక్టర్లు ఏంది సామీ!
పెద్ద పెద్ద చక్రాలతో కూడిన ట్రాక్టర్లు..వాటితో పాటు లోడ్ చేసే తొట్టెలు ఉన్నాయి. ఇదేంటి వెరైటీగా ఉంది వ్యవహారం అనుకుంటున్నారా? ఇది నిజమే.
By: Tupaki Desk | 18 Aug 2023 7:15 AM GMTసాధారణంగా సినిమా థియేటర్ పార్కింగ్ లో కార్లు..బైక్లు..ఆటోలు ఉంటాయి. కానీ 'గదర్-2' థియేటర్ పార్కింగ్ లో ఏమున్నాయో తెలుసా? పెద్ద పెద్ద చక్రాలతో కూడిన ట్రాక్టర్లు..వాటితో పాటు లోడ్ చేసే తొట్టెలు ఉన్నాయి. ఇదేంటి వెరైటీగా ఉంది వ్యవహారం అనుకుంటున్నారా? ఇది నిజమే. ఆ సినిమా చూడటానికి వచ్చిన వారంతా ట్రాక్టర్లు వేసుకుని థియేటర్ కి వస్తున్నారు. ట్రాక్లర్ పై 'గదర్ -2' పోస్టర్లు...ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుని రుయ్ రుయ్ అంటూ ట్రాక్టర్ ఇంజిన్లు సెల్లార్ లో దర్శనమిస్తున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలోని థియేటర్ల న్నింటిలో ఇదే సన్నివేశం కనిపిస్తుంది. భారత్ మాతాకి జై అని నినాదాలు చేసుకుంటూ థియేటర్లోకి వస్తున్నారు అభిమానులు. థియేటర్ సిబ్బంది పార్కింగ్ ఖాళీగా లేదు అన్నా వినడం లేదు. వాళ్ల మాటల్ని పెడ చెవిన పెట్టి తమ ట్రాక్టర్ ని సెల్లార్ పార్కింగ్ లో పెడుతున్నారు. దానికి సంబంధించి కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే? ఈ సినిమా ఇండియా-పాకిస్తాన్ స్టోరీ కావడంతో పంజాబీలుంతా ఇలా దేశభక్తిని చాటుకుంటున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయింది. దీంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లకి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గతంలో బాలయ్య నటించిన 'అఖండ' సినిమాకి కూడా అభిమానులు గ్రామాల నుంచి లా ట్రాక్టర్ల ద్వారా తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడెక్కడో మారు మూల గ్రామాల నుంచి పట్టణాలకు ట్రాక్టర్ల ద్వారా ప్రయాణించి సినిమా చూసి ఇంటికెళ్లారు. పాత కాలం రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా కనిపించేది.
ట్రాకర్టకంటే ముందు ఎడ్ల బళ్లపై సినిమాలకు వెళ్లేవారు. అంతకు ముందు సినిమా కోసం సైకిల్ లేని వాళ్లు కిలో మీటర్లు నడిచి మరీ వెళ్లేవారు. ప్రస్తుతం అంతా అప్ డేట్ అయినా మళ్లీ ఇలా పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. ఆ రకంగా నేటి తరం యువతకి ఇదొక వైవిథ్యమైన అనుభూతినిస్తుంది.