Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ బుకింగ్స్.. రెండవ రోజు దెబ్బ పడింది!

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే, రెండవ రోజు టాక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 12:19 PM GMT
గేమ్ ఛేంజర్ బుకింగ్స్.. రెండవ రోజు దెబ్బ పడింది!
X

గేమ్ ఛేంజర్ మొదటి రోజు భారీ అంచనాల నడుమ విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ టాక్ మాత్రం అనుకున్నంత పాజిటివ్‌గా రాలేదు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే, రెండవ రోజు టాక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్స్‌లో వచ్చిన డేటా చూస్తే, ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా తగ్గుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో రెండవ రోజు 908 షోల కోసం రూ. 2.4 కోట్ల మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి, ఏకంగా 24.5% ఆక్యుపెన్సీతో. మొదటి రోజుకి పోలిస్తే ఇది చాలా తక్కువ. బెంగళూరులో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది, 703 షోల కోసం కేవలం 70 లక్షల బుకింగ్స్ మాత్రమే వచ్చాయి, ఆక్యుపెన్సీ 10.1% మాత్రమే. ఈ నగరాల్లో ఈ స్థాయిలో బుకింగ్స్ నమోదు కావడం సినిమా టాక్‌పై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది.

విశాఖపట్నంలో మాత్రం కొంత మెరుగైన పరిస్థితి ఉంది. 253 షోల కోసం రూ. 73 లక్షల బుకింగ్స్ రాగా, ఆక్యుపెన్సీ 30% గా ఉంది. విజయవాడలో రూ. 35 లక్షల బుకింగ్స్‌తో 19.8% ఆక్యుపెన్సీ రికార్డు కాగా, గుంటూరులో కేవలం 42 షోల కోసం రూ. 10 లక్షల బుకింగ్స్ వచ్చాయి. గుంటూరులో ఆక్యుపెన్సీ 40.5% గా ఉందని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.

ఒంగోలులో పరిస్థితి మరింత బలహీనంగా ఉంది. 33 షోల కోసం కేవలం రూ. 8 లక్షల బుకింగ్స్ మాత్రమే వచ్చాయి, 15.6% ఆక్యుపెన్సీతో. ఈ పట్టణాల్లో సినిమా ప్రదర్శన అంతంత మాత్రమేనని కనిపిస్తోంది. ఈ పరిస్థితులు రెండవ రోజు వసూళ్లపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా, రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ డేటా చూస్తే, గేమ్ ఛేంజర్ ఓవర్ఆల్ గ్రాస్ రాబడిలో పడిపోయే అవకాశం ఉందని అనిపిస్తోంది.

ఏదైనా మ్యాజిక్ జరిగితేనే మళ్లీ సినిమాకు హైప్ రాగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికైనా సినిమా టీమ్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టి, నెగిటివ్ టాక్‌ను అదుపు చేయాలని ట్రేడ్ అనలిస్టులు సూచిస్తున్నారు. గేమ్ ఛేంజర్ రెండవ రోజు తన గ్రిప్‌ను మళ్లీ పుంజుకుని బాక్సాఫీస్‌లో నిలుస్తుందో లేదో వేచి చూడాలి. సినిమా అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసుకోవాలి అంటే ఈ వీకెండ్ లో ఇంకా బలమైన కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది.

గేమ్ ఛేంజర్ రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్

1. హైదరాబాద్: ₹2.4 కోట్లు - 908 షోలు (24.5% ఆక్యుపెన్సీ)

2. బెంగళూరు: ₹70 లక్షలు - 703 షోలు (10.1% ఆక్యుపెన్సీ)

3. విశాఖపట్నం: ₹73 లక్షలు - 253 షోలు (30% ఆక్యుపెన్సీ)

4. విజయవాడ: ₹35 లక్షలు - 169 షోలు (19.8% ఆక్యుపెన్సీ)

5. గుంటూరు: ₹10 లక్షలు - 42 షోలు (40.5% ఆక్యుపెన్సీ)

6. ఒంగోలు: ₹8 లక్షలు - 33 షోలు (15.6% ఆక్యుపెన్సీ)