Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్… బుకింగ్స్ పెరగాలంటే..

అయితే ‘గేమ్ చేంజర్’ రిలీజ్ కి ఇంకా 8 రోజుల సమయమే ఉంది. ఈ మూవీ ప్రీసేల్ డిసెంబర్ లోనే స్టార్ట్ చేశారు. నార్త్ అమెరికాలో 1134 ప్రీమియర్ షోలు గేమ్ చేంజర్ కిపడబోతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Jan 2025 7:14 AM GMT
గేమ్ చేంజర్… బుకింగ్స్ పెరగాలంటే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అయిన ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అయితే ట్రెండ్ అయ్యాయి. కానీ మూవీకి నెక్స్ట్ లెవల్ హైప్ తీసుకొని రాలేకపోయాయి. థమన్ నుంచి ఎప్పటిలాగే హైవోల్టేజ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ గేమ్ చేంజర్ లో ఉన్నాయి.

అయితే ఇంకా ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ పైన ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి కారణం. కేవలం వాటికోసమే 70 కోట్ల వరకు ఖర్చు పెట్టారనే న్యూస్ బయటకి రావడమే. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కూడా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చూడాలనే ఇంటరెస్ట్ తో ఉన్నారు.

ఈ ట్రైలర్ తర్వాత అయిన సినిమాపైన హైప్ పెరుగుతుందేమో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నార్త్ అమెరికాలో ‘గేమ్’ చేంజర్ కి కూడా అడ్వాన్స్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. వీటి కోసం నెల రోజుల ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. గత ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో పుష్ప 2 ప్రీసేల్ అత్యధికంగా జరిగింది.

ఆ సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో ప్రీమియర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ‘గేమ్ చేంజర్’ రిలీజ్ కి ఇంకా 8 రోజుల సమయమే ఉంది. ఈ మూవీ ప్రీసేల్ డిసెంబర్ లోనే స్టార్ట్ చేశారు. నార్త్ అమెరికాలో 1134 ప్రీమియర్ షోలు గేమ్ చేంజర్ కిపడబోతున్నాయి. ఈ షోలలో ఇప్పటి వరకు ప్రీసేల్ ద్వారా 383.4K డాలర్స్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.

యూఎస్ లో 387 లొకేషన్స్ లో 111 షోలు పడుతున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 13,022 టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. వీటి ద్వారా 368,789 డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కెనడాలో 9 లొకేషన్స్ లో 23 షోలు వేస్తున్నారు. వీటిలో 544 టికెట్స్ ఇప్పటి వరకు సోల్డ్ అయ్యాయి. వీటి ద్వారా 14,658 డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయితే ఈ ప్రీసేల్ బుకింగ్స్ భారీగా జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

యూఎస్- $368,785 కలెక్షన్స్ |387 లొకేషన్స్ | 1111 షోలు | 13,022 టికెట్స్

కెనడా - $14,658 కలెక్షన్స్ |9 లొకేషన్స్ | 23 షోలు | 544 టికెట్లు