Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ బుకింగ్స్.. స్కై డైవింగ్ చేసి మరీ..

ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్.. రామ్ చరణ్ పై ఉన్న తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 11:38 AM GMT
గేమ్ ఛేంజర్ బుకింగ్స్.. స్కై డైవింగ్ చేసి మరీ..
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌ గా రూపొందుతున్న ఆ సినిమాలో రామ్ చరణ్.. విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే వినయ విధేయ రామలో చరణ్ కు జోడీగా నటించిన ఆ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. తెలుగు బ్యూటీ అంజలి మరో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.

అయితే మరో 25 రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అవ్వనుండగా.. ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే మూవీ టీజర్ తో పాటు మూడు పాటలు రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరిన్ని అప్డేట్స్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అదే సమయంలో ఇప్పటికే యూకేలో గేమ్ ఛేంజర్ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. తాజాగా అమెరికాలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్.. రామ్ చరణ్ పై ఉన్న తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. అమెరికాలో గేమ్ ఛేంజర్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయని రాసున్న పోస్టర్ ను పట్టుకుని స్కై డైవింగ్ చేశారు.

ఎయిర్ క్రాఫ్ట్ నుంచి జంప్ చేసి స్కై డైవింగ్ చేస్తూ పోస్టర్ ను ప్రదర్శించారు. అందుకు సంబంధించిన వీడియోను గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం యూఎస్ లో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగనున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే టెక్సాస్ లోని డల్లాస్ లో డిసెంబర్ 21వ తేదీన మేకర్స్.. గ్రాండ్ గా వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. రామ్ చరణ్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా వెళ్లనున్నారు. మరి సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.