Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. తెలుగు రాష్ట్రాల టార్గెట్ ఎంతంటే?

దీంతో కచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకోవాల్సి ఉంది. అటు డైరెక్టర్ శంకర్ కి కూడా కెరియర్ పరంగా ‘గేమ్ చేంజర్’ సక్సెస్ చాలా అవసరం.

By:  Tupaki Desk   |   7 Jan 2025 10:47 AM GMT
గేమ్ చేంజర్.. తెలుగు రాష్ట్రాల టార్గెట్ ఎంతంటే?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి జనవరి 10న రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ పైన మెగా ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ నుంచి రాబోయే చిత్రం కావడంతో ఈ మూవీపైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆయనకి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి.

దీంతో కచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకోవాల్సి ఉంది. అటు డైరెక్టర్ శంకర్ కి కూడా కెరియర్ పరంగా ‘గేమ్ చేంజర్’ సక్సెస్ చాలా అవసరం. ఇక రామ్ చరణ్ కూడా తన మార్కెట్ స్టామినా ఏంటనేది ఈ చిత్రంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో ఈ మూవీ ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చారు. అలాగే టికెట్ ధరలు కూడా పెంచుతూ జీవో జారీ చేశారు. తెలంగాణాలో కూడా టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది.

దీనిపై ఈ రెండు, మూడు రోజుల్లో స్పష్టత రావొచ్చు. మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో 130 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తోంది. అందులో నైజాంలో నుంచి 37 కోట్ల మేరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. ఇక ఆంధ్రాలో 70 కోట్లు, సీడెడ్ లో 20 కోట్ల మేరకు బిజినెస్ అయ్యింది.

ఓవరాల్ గా చూసుకుంటే 127 కోట్ల మేరకు ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రాలలో థీయాట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే చరణ్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అది కూడా సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ ని ‘గేమ్ చేంజర్’ అందుకోవడానికి అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరి రామ్ చరణ్ ఈ టార్గెట్ కలెక్షన్స్ ని అందుకొని నిర్మాత దిల్ రాజుకి ‘గేమ్ చేంజర్’ తో ఎలాంటి లాభాలు అందుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గేమ్ చేంజర్ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించగా ఎస్ జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.