Begin typing your search above and press return to search.

'గేమ్‌ ఛేంజర్‌' సెన్సార్‌ రిపోర్ట్‌ వచ్చింది

ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లోని సన్నివేశాలకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 7:06 AM GMT
గేమ్‌ ఛేంజర్‌ సెన్సార్‌ రిపోర్ట్‌ వచ్చింది
X

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర, అందుకు సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని అంటున్నారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే అంజలి పాత్ర సైతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.


సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లోని సన్నివేశాలకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. అంతే కాకుండా కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్‌ని మ్యూట్‌ చేయడం, కొన్ని టైటిల్‌ కార్డ్స్ పేర్లను తొలగించడం ఇలా సెన్సార్‌ బోర్డ్‌ నుంచి చిన్న చిన్న మార్పులతో క్లియరెన్స్ వచ్చింది. సెన్సార్‌ బోర్డ్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ అనుసారం ఈ సినిమా మొత్తంగా 165 నిమిషాలు అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంటుంది. మరీ ఎక్కువ రన్‌ టైమ్‌ కాకుండా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.

రామ్‌ చరణ్ నాలుగు ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వినయ విధేయ రామ సినిమాతో గతంలో నిరాశ పరచిన రామ్‌ చరణ్ ఈ సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌ ఈ సినిమాతో రామ్‌ చరణ్‌కి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందించడం ద్వారా మళ్లీ తన పూర్వ వైభవం ను సంతరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. శంకర్‌ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన సమయంలో అంచనాలు భారీగా పెరిగాయి. మధ్యలో ఇండియన్‌ 2 సినిమా వచ్చిన కారణంగా మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియన్ 2 ఫలితం తో సంబంధం లేకుండా సినిమా ఉంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తూ గేమ్‌ చేంజర్‌ టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. గేమ్‌ ఛేంజర్‌ టీజర్ విడుదల తర్వాత మొత్తం మారి పోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నేడు సాయంత్రం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరగడం ఖాయం. ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు మూడు గంటలకు పైగా నిడివితో వస్తున్నారు. కానీ గేమ్‌ ఛేంజర్‌ రిస్క్‌ తీసుకోకుండా ముందుగానే పావు తక్కువ మూడు గంటలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.