Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ లో అవి ఎక్స్ పెక్ట్ చేయకూడదా?

ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన రూబెన్ తాజాగా మూవీలో సాంగ్స్ పై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 10:02 AM GMT
గేమ్ చేంజర్ లో అవి ఎక్స్ పెక్ట్ చేయకూడదా?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ జనవరి 10న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో సినిమాపైన హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు.

నిర్మాత దిల్ రాజు ఇప్పటికే మూవీని వీలైనంత స్ట్రాంగ్ గా జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ కి ఓ మోస్తరు ఆదరణ లభించింది. అయితే విజువలైజేషన్ పరంగా ఈ సాంగ్స్ అద్భుతంగా ఉంటాయనే మాట బలంగా వినిపిస్తోంది.

దీనికి కారణం శంకర్ క్రియేటివ్ విజన్. అతని సినిమాలలో సాంగ్స్ పిక్చరైజేషన్ అంతా కూడా ఒక విజువల్ స్పెక్టక్యులర్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఈ సినిమాలోని కూడా సాంగ్స్ కోసమే ఏకంగా 70 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టారని సమాచారం. అయితే ఈ సాంగ్స్ పిక్చరైజేషన్ ని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకునే ప్రేక్షకులకి మాత్రం షాక్ తప్పేలా లేదనిపిస్తోంది.

ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన రూబెన్ తాజాగా మూవీలో సాంగ్స్ పై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రన్ టైం 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని చెప్పారు. అలాగే మూవీ ఫైనల్ కాపీలో ఫుల్ సాంగ్స్ కనిపించవని చెప్పారు. కేవలం సాంగ్స్ కి కొంతభాగం మాత్రమే ఉంటుందని అన్నారు. తరువాత వీడియో సాంగ్స్ మొత్తాన్ని యుట్యూబ్ లో రిలీజ్ చేస్తారంట.

ఆయన మాటల బట్టి సినిమాలు సాంగ్స్ పూర్తి విజువల్స్ ని చూడటం సాధ్యం కాదని అర్ధమైపోయింది. ఇది నిజంగా ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా చాలా మంది శంకర్ సినిమాలలో సాంగ్స్ పిక్చరైజేషన్స్ చూడటానికి థియేటర్స్ కి వస్తూ ఉంటారు.

అయితే ఇందులో పూర్తి నిడివితో సాంగ్స్ ఉండవనే మాట బయటకి రావడంతో ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ కీలక పాత్ర చేశారు. సంక్రాంతి రేసులో ఈ మూవీ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.