Begin typing your search above and press return to search.

అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ పరిహారం!

అయితే.. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jan 2025 10:04 AM GMT
అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్  పరిహారం!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్" సినిమాకు సంబంధించిన ప్రీ రిజీల్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా.. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన తోకాడ చరణ్ (22), ఆరవ మణికంఠ అనే ఇద్దరు అభిమానులు.. వేడుక ముగిసిన అనంతరం బైక్ పై తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో భాగంగా వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వడిశలేరులో ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ చనిపోయారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న సినిమా హీరో రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన అభిమానుల ఇంటికి తన సన్నిహితులతో పాటు తన వ్యక్తిగత సిబ్బందిని పంపించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా కుటుంబ సభ్యులకు అందజేశారు.

అవును... గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రామాదంలో మృతి చెందడంతో రామ్ చరణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. మృతులు ఇద్దరి కుటుంబాలకు తలో రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సమయంలో.. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించిన వివరాలకు చెర్రీ ఫ్యాన్స్ బాధితుల పేరెంట్స్ కు అందచేశారు.

కాగా.. ఇప్పటికే మృతుల కుటుంబాలకు సినిమా నిర్మాత దిల్ రాజుతో పాటు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మృతుల కుటుంబాలకు దిల్ రాజు తలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా.. పవన్ కల్యాణ్ కూడా ఐదేసి లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.