Begin typing your search above and press return to search.

షాకింగ్.. అక్కడ 'గేమ్ ఛేంజర్'కు జీరో షేర్..?

శంకర్ షణ్ముంగం దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ''గేమ్ ఛేంజర్" సినిమా ఎట్టకేలకు నిన్న శుక్రవారం విడుదలైంది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 4:09 AM GMT
షాకింగ్.. అక్కడ గేమ్ ఛేంజర్కు జీరో షేర్..?
X

శంకర్ షణ్ముంగం దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ''గేమ్ ఛేంజర్" సినిమా ఎట్టకేలకు నిన్న శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. రివ్యూలు కూడా ఏమంత గొప్పగా లేవు. తెలుగులోనే కాదు, తమిళ హిందీ మలయాళ భాషల్లోనూ తొలి రోజు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.

హీరో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నా, శంకర్ అవుట్ డేటెడ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే సినిమాను దెబ్బ కొట్టిందని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. 'గేమ్ ఛేంజర్‌'లో చర్చించిన రాజకీయాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ అసాధ్యమని, లాజిక్ లేకుండా తీశారని చాలా మంది సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. సాంగ్స్ కోసం 75 కోట్లు చేసి విజువల్ వండర్ తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన శంకర్.. మిగతా సినిమా మేకింగ్ మీద కూడా మరింత దృష్టి పెట్టాల్సిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని తమిళ తంబీలు ఆశించారు. 'ఇండియన్ 2' డిజార్డర్ ఫలితంతో విమర్శలు ఎదుర్కోవడంతో, ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టుతో అందరికీ సరైన సమాధానం చెప్పాలని కోరుకున్నారు. కానీ దర్శకుడు మళ్లీ యావరేజ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు. తమిళనాడులో తొలిరోజు బుకింగ్స్ చాలా సెంటర్లలో యావరేజ్‌గా ఉన్నాయి.

శంకర్ బ్రాండ్, RRR స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా తమిళ మార్కెట్ లో ఏమంత గొప్ప ఓపెనింగ్స్ సాధించలేదు. హిందీ బెల్ట్ లోనూ రామ్ చరణ్ మూవీ పరిస్థితి అలానే ఉందని తెలుస్తోంది. 'పుష్ప 2' చిత్రాన్ని ఆదరించిన ఉత్తరాది జనాలు.. 'గేమ్ ఛేంజర్' పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదు. కాకపోతే నిన్న నైట్ షోలలో నార్త్ ఇండియాలో కొన్ని మేజర్ సిటీస్ లలో సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

మలయాళంలో 'గేమ్ ఛేంజర్‌' సినిమాకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు. కేరళలో ఫస్ట్ డే అసలు థియేటర్ షేర్ రాలేదని అంటున్నారు. 'రాధే శ్యామ్' తర్వాత, కేరళలో ఓపెనింగ్ డే నాడు జీరో షేర్ నమోదు చేసిన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నార్త్ అమెరికాలో తొలి రోజు 437 లోకేషన్స్ లో $318,447 వసూలు చేసినట్లుగా నివేదించబడింది.

ఉత్తర అమెరికాలో తెలుగు - $289K, హిందీ - $24K, తమిళం - $5.5K గా ''గేమ్ ఛేంజర్'' కలెక్షన్స్ ఉన్నాయని రిపోర్ట్స్ తెలిపాయి. ప్రస్తుతం యూఎస్ఏలో 'గుంటూరు కారం' కంటే తక్కువ ట్రెండ్‌లో ఉందని అంటున్నారు. మంచి నంబర్స్ రావాలంటే బలమైన వాక్-ఇన్‌లు అవసరం వుంది. ఫస్ట్ డే ఎక్కువగా అభిమానులు, విమర్శకులు మాత్రమే సినిమాను చూస్తారు. రెండో రోజు నుంచి థియేటర్లకు వచ్చే సాధారణ ప్రేక్షకులపై మాత్రమే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి పొంగల్ సీజన్‌ను క్యాష్ చేసుకుని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తుందో లేదో చూడాలి.