Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ 2వ రోజు కలెక్షన్స్.. ఊహించని డౌన్

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలైంది.

By:  Tupaki Desk   |   12 Jan 2025 11:41 AM GMT
గేమ్ ఛేంజర్ 2వ రోజు కలెక్షన్స్.. ఊహించని డౌన్
X

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా భారీ హైప్ క్రియేట్ అయింది. మొదటి రోజున భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు మాత్రం ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రావడం, పాజిటివ్ రివ్యూలు అనుకున్నంతగా రాకపోవడం రెండవ రోజు కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.

సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 221 కోట్ల రేంజ్‌లో జరిగింది. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. కానీ, సినిమా రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8.24 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సినిమా 39.52 కోట్ల షేర్ రాబట్టింది. అయితే, రెండవ రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. మిగతా ప్రాంతాల కంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్రాప్ మరింత స్పష్టంగా ఉంది. హిందీ మార్కెట్‌లో సినిమా కొంత మెరుగ్గా నిలబడినా, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో కలెక్షన్లు సగటు స్థాయికే పరిమితమయ్యాయి.

ఫస్ట్ డే హైప్తో ముందుకు దూసుకెళ్లిన ఈ చిత్రం, మౌత్ టాక్ బలంగా లేకపోవడం వల్ల రెండవ రోజు ప్రేక్షకుల రీచ్ తగ్గింది. ట్రేడ్ విశ్లేషకులు సినిమా వసూళ్లు రాబోయే రోజుల్లో కాస్త మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. కానీ, బ్రేక్ ఈవెన్ సాధించడానికి సినిమా మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఇక రెండు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాల్లో 47.76 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 72.61 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ఈ వసూళ్లు మేకర్స్ అంచనాలకు తగ్గట్టు లేకపోవడం, ఫ్యూచర్ వసూళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.

గేమ్ ఛేంజర్ రెండు రోజుల కలెక్షన్లు (షేర్):

నైజాం: ₹13.96 కోట్లు

సీడెడ్: ₹7.69 కోట్లు

ఉత్తరాంధ్ర: ₹6.82 కోట్లు

తూర్పు గోదావరి: ₹5.41 కోట్లు

పశ్చిమ గోదావరి: ₹2.72 కోట్లు

గుంటూరు: ₹4.86 కోట్లు

కృష్ణా: ₹3.62 కోట్లు

నెల్లూరు: ₹2.68 కోట్లు

కర్ణాటక: ₹3.60 కోట్లు

తమిళనాడు: ₹2.30 కోట్లు

కేరళ: ₹20 లక్షలు

హిందీ + ROI: ₹8.15 కోట్లు

ఓవర్సీస్: ₹10.60 కోట్లు

మొత్తం ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: ₹72.61 కోట్లు (గ్రాస్: ₹125.10 కోట్లు)

మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా ₹150.39 కోట్లు అవసరం.