Begin typing your search above and press return to search.

దేవర.. గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయగలదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 5:05 AM GMT
దేవర.. గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయగలదా?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సెస్ అందుకున్నారు. బాహుబలి 2 తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ మూవీతో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఇప్పుడు సోలోగా పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాపై 350-400 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. మొదటి రోజు 150 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేవర చిత్రం రిలీజ్ కి ముందే చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. చుట్టమల్లే సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాకుండానే నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకుంది.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో ట్రైలర్ రిలీజ్ కాకుండా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకోలేదు. ఇది రేర్ ఫీట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ తో రికార్డులు సృష్టించి తారక్, చరణ్ ఇప్పుడు సోలోగా రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందరికంటే వేగంగా అందుకోవడం ద్వారా దేవర మూవీ గేమ్ చేంజర్ కి ఒక టార్గెట్ ఇచ్చింది. దీనిని చరణ్ గేమ్ చేంజర్ తో బ్రేక్ చేయగలడా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే గేమ్ చేంజర్ పై చెప్పుకోదగ్గ బజ్ లేదు. రిలీజ్ అయిన ఒక సాంగ్ కూడా పెద్దగా మెప్పించలేదు. వినాయకచవితికి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు.

గేమ్ చేంజర్ ని టీజర్ రిలీజ్ చేసి మూవీ పైన బజ్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా అయితేనే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. దానికి తగ్గట్లుగానే టికెట్ బుకింగ్స్ ఉంటాయి. యూఎస్ లో దేవర క్రియేట్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ రికార్డ్ ని గేమ్ చేంజర్ బ్రేక్ చేయాలంటే మాత్రం ఈ మూడు నెలల్లో సినిమాకి భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చే కంటెంట్ ని మేకర్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరి శంకర్ గేమ్ చేంజర్ కోసం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడనేది వేచి చూడాల్సిందే. డిసెంబర్ లో క్రిస్టమస్ కు ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే.