Begin typing your search above and press return to search.

టాప్ 5 మిలియన్.. గేమ్ ఛేంజర్ కొడుతుందా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీతో 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 5:22 AM GMT
టాప్ 5 మిలియన్.. గేమ్ ఛేంజర్ కొడుతుందా?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీతో 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమాపై ప్రస్తుతం చెప్పుకోదగ్గ బజ్ లేదు. అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాకి వీలైనంత స్ట్రాంగ్ గా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. రెగ్యులర్ గా మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకులు ‘గేమ్ చేంజర్’ మూవీ గురించి మాట్లాడుకునేలా చేయాలని అనుకుంటున్నారు. అలా అయితేనే మూవీ భారీ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంటుంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నిజానికి ఒకప్పుడు అయితే శంకర్ బ్రాండ్ ఇమేజ్ తోనే ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చేసేది. కానీ డైరెక్టర్ శంకర్ కి ‘రోబో’ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ పడలేదు. చివరిగా వచ్చిన ‘భారతీయుడు 2’ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దీంతో శంకర్ ఇమేజ్ ‘గేమ్ చేంజర్’ కి కొంత మైనస్ అయ్యేలా ఉందనే మాట ఇపుడు వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మరల బౌన్స్ బ్యాక్ అవ్వాలని శంకర్ ‘గేమ్ చేంజర్’ అవుట్ ఫుట్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు.

అందుకే మూవీ ప్రమోషన్స్ బాధ్యత అంతా దిల్ రాజు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ ముందు చాలా పెద్ద టార్గెట్ ఉంది. దానిని ఏ మేరకు అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని ‘గేమ్ చేంజర్’ అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడందరూ చూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి 4 సార్లు 5 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ని ఓవర్సీస్ లో అందుకున్నారు.

‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘సలార్’, ‘కల్కి 2898ఏడీ’ సినిమాలు 5 మిలియన్ డాలర్స్ క్లబ్ లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తో 5 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరారు. ఎన్టీఆర్ సోలోగా ‘దేవర’ మూవీతో మరల 5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకున్నాడు. మరో వైపు ‘హనుమాన్’ మూవీతో తేజా సజ్జా కూడా 5 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిపోయాడు.

నెక్స్ట్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీతో రామ్ చరణ్ ఈ ఫీట్ ని అందుకుటాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ‘గేమ్ చేంజర్’ ఆ క్లబ్ లో చేరితే చరణ్ రెండు సార్లు ఓవర్సీస్ 5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ అందుకున్న హీరోగా నిలుస్తాడు. ‘పుష్ప 2’ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.

బాహుబలి 2 – $20.77M

కల్కి 2898 AD – $18.5M

ఆర్ఆర్ఆర్ – $15M

సలార్ – $8.9M

బాహుబలి – $8.9M

దేవర – $8.9M

హనుమాన్ – $5.2M