Begin typing your search above and press return to search.

'గేమ్‌ ఛేంజర్‌' నుంచి మరో రెండు పాటలు!

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   9 Dec 2024 10:30 PM GMT
గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో రెండు పాటలు!
X

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా నుంచి మరో రెండు పాటలు రావాల్సి ఉంది. అయితే అందులో ఒక పాటను సినిమాతో పాటు చూడాల్సి ఉంటుందట. అంటే ముందుగా విడుదల చేసే అవకాశం లేదు. ఒక పాటను మాత్రం యూఎస్‌లో జరగబోతున్న ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నారు. భారీ ఎత్తున యూఎస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

యూఎస్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేయాలని భావించారు. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. పాట లేదా ట్రైలర్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. రికార్డ్‌ స్థాయిలో అత్యధిక స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తూ ఉన్నారు. గేమ్‌ ఛేంజర్‌ టీజర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు శంకర్‌ సినిమాను రూపొందించారు అంటూ వార్తలు వస్తున్నాయి.

రామ్‌ చరణ్ డ్యూయెల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీయారా అద్వానీ, అంజలిలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమాలో తండ్రి, కొడుకు పాత్రల్లో చరణ్ కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించబోతుంది, ఇక కొడుకు పాత్ర కోసం కియారా అద్వానీని ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఒక భారీ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ఉంటుందని, తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా సినిమా ఉంటుంది అంటూ దిల్‌ రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు. మరో వైపు వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి ఈ మూడు సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్నా గేమ్‌ ఛేంజర్ మాత్రమే పాన్‌ ఇండియా మూవీగా రాబోతుంది. మరి అంచనాలను గేమ్‌ ఛేంజర్ ఏ స్థాయిలో అందుకుంటుంది అనేది చూడాలి.